డ్రైవర్స్ కి ఎల్లప్పుడూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తా.
బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని మే 31(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని మహాలక్ష్మి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన డ్రైవర్స్ కి ఇన్సూరెన్స్ బాండ్స్, ఐడి కార్డ్ ల పంపిణి కార్యక్రమంలో పాల్గొని చంద్రుపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్,బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.డ్రైవర్స్ కి ఉచితంగా ప్రమాద బీమా బాండ్స్ పంపిణి చేశారు. అనంతరం సునీల్ రెడ్డి ని శాలువాతో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు సన్మానించారు. సునీల్ రెడ్డి మాట్లాడుతూ సమాజం లో డ్రైవర్స్ పాత్ర చాల గొప్పది,ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటారు. ఎల్లప్పుడూ ప్రమాదలతో సహవాసం చేస్తుంటారు. అలాంటి వారికి నా వంతుగా ప్రమాద భీమా చేయించి ఇవ్వడం చాల ఆనందంగా ఉందని,ఇంకా ఎవరైనా ఇన్సూరెన్స్ చేయించుకోని వారు ఎవరైనా ఉంటె నా కార్యాలయ వ్యక్తిగత సహాయకులను సంప్రదించి మీ వివరాలు వారికి అందజేయాలని అన్నారు. డ్రైవర్ ల కష్టసుఖలలో పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని, డ్రైవర్స్ సోదరులకు ఎల్లప్పుడూ నా వంతు సహాయ, సహకారాలు అందిస్తానని 12 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మార్పు కొరకు పరితపిస్తున్న, గత పాలకుల నిర్లక్ష్యం,అసమర్ధత వల్ల మంథని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని నియోజకవర్గంలో ఒక్కసారి మార్పు జరిగితే అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్న,మన నియోజకవర్గం లో ఒక స్పీకర్, మంత్రిగా ముఖ్య మంత్రిగా,ఒక ప్రధాన మంత్రిగా దశాబ్దాల తరబడి పరిపాలించిన నాయకులు కనీసం ఒక హాస్పిటల్, పరిశ్రమ కూడ మంథనికి తేలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఉపి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు కీసరి సదయ్య ముదిరాజ్, ఏడిఉపి ఉప అధ్యక్షులు గుర్రాల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరి నరేష్, జిల్లా ఇంచార్జ్ గుండవేన స్వామి, మండల అధ్యక్షులు బందెల శ్రీనివాస్, ఉప అధ్యక్షులు కుమార్, ప్రధాన కార్యదర్శి కే రవీందర్, రేపాక శంకర్,కోశాధికారులు బీ సాగర్, ఎం నరేష్ ,నీలి స్వామి, బూడిద గట్టయ్య, రాం శ్రీనివాస్, బూడిద జైపాల్ తో పాటు అధిక సంఖ్యలో డ్రైవర్ లు పాల్గొన్నారు.