Wednesday, September 18, 2024
Homeతెలంగాణస్మశాన వాటికను నిర్మించండి మహా ప్రభో...

స్మశాన వాటికను నిర్మించండి మహా ప్రభో…

స్మశాన వాటికను నిర్మించండి మహా ప్రభో…

బి.అర్.ఎస్ నాయకులు పురం రమణ

సుల్తానాబాద్,మే17(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ నూతన మున్సిపాలిటీగా రూపాంతరం చెంది మూడు సంవత్సరాలు గడుస్తున్నా పూసాల లో స్మశాన వాటిక లేక ప్రజలు నాన అవస్థలు పడుతున్నా  కూడా ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు అని బి.అర్.ఎస్ నాయకులు పురం రమణ అన్నారు. స్మశాన వాటిక నిర్మాణం పేరుతో తూ తూ మంత్రంగా రెండు రేకుల షెడ్లు మాత్రమే నిర్మాణం చేసి చేతులు దులుపుకున్న సదరు కాంట్రాక్టర్ స్మశాన వాటిక వద్ద దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేయడానికి నీటి సౌకర్యాన్ని కల్పించకపోవడంతో పూసాల, శాస్త్రి నగర్, స్వప్న కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అసంపూర్ణంగా నిర్మాణమైన స్మశాన వాటిక 

ప్రభుత్వం గ్రామస్థాయిలో కొన్ని లక్షలాది రూపాయలు వెచ్చించి వైకుంఠ దామాలను ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలను కల్పిస్తున్న తరుణంలో మున్సిపల్ పరిధిలో అధునాతనాతనమైన వైకుంఠధామములను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉంది. కానీ పూసాల వైకుంఠధామం నిర్మాణం విషయంలో ప్రభుత్వం గానీ, అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తుందో అర్థం కానీ పరిస్థితి ఉందని పలువురు ప్రజలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అసలు పూసాల స్మశాన వాటిక ఉందా లేదా అన్న పరిస్థితి దాపురించింది. పూసాల స్మశాన వాటికకు వెళ్లాలంటేనే ప్రజలు జంకె పరిస్థితి దాపురించిందని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పూసాల,శాస్త్రి నగర్, స్వప్న కాలనీ ప్రజలు ఇబ్బందులు తొలగించాలని పురం రమణ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!