Friday, September 20, 2024
Homeతెలంగాణమంథని చరిత్రను తిరగరాసి ఆదర్శంగా నిలబెట్టాలే...

మంథని చరిత్రను తిరగరాసి ఆదర్శంగా నిలబెట్టాలే…

మంథని చరిత్రను తిరగరాసి ఆదర్శంగా నిలబెట్టాలే…

ఓబీసీ రిజర్వేషన్‌ తీసుకువచ్చిన ఘనత బీపీ మండల్‌దే..

శాసన మండలి వైస్‌ చైర్మన్‌ బండ ప్రకాష్‌

మంథని మే 16(కలం శ్రీ న్యూస్):మహనీయుల స్పూర్తిని చాటుతున్న మంథని చరిత్రను తిరగరాసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసన మండలి వైస్‌ చైర్మన్‌, మాజీ పార్లమెంట్‌ రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌ పిలుపునిచ్చారు. మంథని పట్టణంలోని బొక్కలవాగు వంతెనపై పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ రిజర్వేషన్‌ పితామహుడు బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ విగ్రహాన్ని ఆయన మనుమడు సూరజ్‌ మండల్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అనేక ఏండ్లుగా మంథని ప్రాంతాన్ని ఒకే కుటుంబం పరిపాలన చేస్తుండటంతో అట్టడుగు వర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఆ ఇబ్బందులు తొలగించే విధంగా చరిత్రను తిరగరాయాలని, అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేస్తూ తిరుగులేని నాయకుడైన పుట్ట మధూకర్‌ను నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. అయితే మంథనిలోనే బీసీ వర్గాలపై కుట్రలు, కుతంత్రాలు కొత్త కాదని, నాటి నుంచే రాష్ట్రంలో దేశంలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ బీజేపీ ప్రభుత్వాలు వివక్ష చూపాయని ఆయన గుర్తు చేశారు. ఆనాడు బీసీలకు రిజర్వేషన్‌ల విషయంలో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ మండల్‌ కమీషన్‌ను వ్యతిరేకించారని అన్నారు. బీసీ వర్గాలపై చూపుతున్న వివక్ష, వ్యతిరేకించే పార్టీలో ఉండనని కొండ లక్ష్మణ్‌బాపూజీ తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు. 1956లోనే కాకా కలేల్‌కర్‌ కమీషన్‌ రిపోర్ట్‌ ఇచ్చినా అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెల్లకుండా పోయిందన్నారు. అయితే అప్పటి ప్రభుత్వాల తీరు కుందేళ్ల జాతిని నమ్ముకుని కుంటుకుంటూ పోయినా ఫర్వాలేదు కానీ తోడేళ్లజాతిని నమ్ముకుని ఎప్పుడు ముందుకు వేయవద్దన్నట్లుగా కమీషన్‌ విషయంలో బలయ్యామని ఆయన అన్నారు. ఈనాడు బీసీ గోస బీజేపీ యాత్ర అంటూ కొంత మంది యాత్రలు చేస్తున్నారని, కానీ ఆనాడు మండల్‌ కమీషన్‌కు వ్యతిరేకంగా ఖమండల్‌ అనే పేరుతో వ్యతిరేక పోరాటం చేశారని, ఆనాడు వీపీ సింగ్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టారని ఆయన వివరించారు. దేశంలోని కొంతమంది కొంతకాలం అధికారంలో ఉన్న నాయకులు తప్ప మిగతా ఎక్కువ కాలం అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు బీసీల రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగానే ఉన్నారని అన్నారు. ఈనాటికి కేంద్రంలో బీసీలకు మంత్రిత్వశాఖ లేదంటే ఎంత వివక్ష ఉందో అర్థం అవుతుందన్నారు. ఈనాడు దేశంలోని 70కోట్ల బీసీలకు బడ్జెట్‌లో 2వేల కోట్లు మాత్రమే కేటాయించడం ఎంత అన్యాయమో గుర్తించాలన్నారు. ఇంత వివక్ష వ్యతిరేకత చూపిస్తున్న క్రమంలోనే బీపీ మండల్‌ మండల్‌ కమీషన్‌ ద్వారా బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించిన మహనీయుడని ఆయన కొనియాడారు. అయితే బీపీ మండల్‌ జన్మదినం, ఇతరత్రా కార్యక్రమాల సందర్బంలో ఆయన చిత్రపటాలు మాత్రమే పెట్టుకుని కార్యాలయాలకే పరిమితం చేశామని, కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రంలోనే మొట్టమొదటి బీపీ మండల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అభినందనీయమన్నారు. మండల్‌ స్పూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అయితే అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంలో ఒక్క ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీలకు సైతం రిజర్వేషన్‌ అందించారని, అలాంటి మహనీయుడి 125అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్‌ నడిబొడ్డున నెలకొల్పి అన్ని వర్గాల ఆత్మగౌరవాన్నిపెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీసీవర్గాలకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని ఈసందర్బంగా ఆయన గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!