Wednesday, December 4, 2024
Homeతెలంగాణమంథనిలో ఆరోగ్య పరీక్షల శిబిరం ప్రారంభం

మంథనిలో ఆరోగ్య పరీక్షల శిబిరం ప్రారంభం

మంథనిలో ఆరోగ్య పరీక్షల శిబిరం ప్రారంభం

మంథని, మే 9(కలం శ్రీ న్యూస్):మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సిఎస్సి హెల్త్ కేర్ ద్వారా లేబర్ కార్డు ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. చైర్మన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో భవన నిర్మాణ కార్మికుల కోసం ఉచిత మెడికల్ క్యాంపు సిఎస్సి హెల్త్ కేర్ ద్వారా కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేయించి వారు బాగోదు చూడడం తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇంకా లేబర్ కార్డు ఉన్న కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి ఎంకే హేమలత భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి, జూనియర్ అసిస్టెంట్ నరేష్ ,సిఎస్సి జిల్లా ఇన్చార్జి తిరుపతి, కార్మిక నాయకులు పుల్లయ్య, సుధాకర్, రామనారాయణ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!