కెసిఆర్ సేవా దళం ఎలిగేడు మండల ఉపాధ్యక్షుడిగా వేగోళపు నాగరాజ్ గౌడ్ ఎన్నిక
ఎలిగేడు,మే06(కలం శ్రీ న్యూస్):కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ఆదేశాల మేరకు, ఎలిగేడు మండల అధ్యక్షులు బింగి రాజు ఆధ్వర్యంలో, ఎలిగేడు మండల కెసిఆర్ సేవా దళం ఉపాధ్యక్షుడిగా వేగోళపు నాగరాజ్ గౌడ్ ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఎలిగేడు మండలంలో ర్యాకల్ దేవపల్లి గ్రామ అధ్యక్షుడిగా తీట్ల శంకర్ ను ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బింగిరాజు, నారాయణపల్లె గ్రామ అధ్యక్షులు పిట్టల నరేష్, ఎలిగేడు గ్రామ అధ్యక్షులు మండల శ్రీశైలం, నాయకులు బత్తిని మహేష్, కొడుదుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.