ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ అందించడమే న్యూ ఇండియా పార్టీ లక్ష్యం
మంథని, మే 5(కలం శ్రీ న్యూస్): న్యూ ఇండియా పార్టీ తలపెట్టిన ఆర్థిక స్వేచ్ఛ విజయసంకల్పయాత్ర శుక్రవారం మంథని పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా మంథని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యూ ఇండియా పార్టీ తలపెట్టిన ప్రధానమైన నాలుగు పథకాల ద్వారా రాష్ట్రంలో దేశంలో ప్రతి పౌరునికి దేశఫలలాలు అందుతాయి.
పౌరసత్వ బందు అంటే ఆధార్ కార్డు ఉన్న ప్రతి పౌరునికి నెల నెలకు 5000 అందించడం. కుటుంబ బందు అంటే ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షలు ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం.గ్రామ బందు ప్రతి గ్రామానికి ఏటా ఏటా ఐదు కోట్లు కేటాయించి ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు పారిశ్రామికంగా ఎదిగించడం కోసం పరిశ్రమలను స్థాపించి ప్రతి ప్రజను ఉద్యోగులుగా మార్చి వారిలో పనితత్వాన్ని పెంచి ఆ గ్రామాన్ని పారిశ్రామిక గ్రామంగా మార్చడం జరుగుతుంది.వ్యవసాయ బందు అంటే ప్రతి ఎకరాకి సంవత్సరానికి 12000 ఇస్తూ 5 ఎకరాలకు తక్కువగా ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 60000 ఇవ్వడం జరుగుతుంది అలాగే భూమిలేని ప్రతి కుటుంబానికి కూడా 60000 ఇవ్వడం జరుగుతుంది.ఈ విధానాల ద్వారా ఈ పథకాల ద్వారా వ్యక్తికి,కుటుంబానికి, గ్రామానికి మరియు దేశానికి ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్ర్యం సిద్ధిస్తాయి.ఇప్పటివరకు ఏలిన పాలకులు, నాయకులు ఆయా పార్టీలు ప్రజలకి ఆర్థిక స్వేచ్ఛ అందించకుండా కల్లబొల్లి పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని విభజించి పాలించడం నేర్చుకోంది తప్ప ప్రజలను బ్రతికిస్తూ, ఎదిగించి, ఆర్థిక స్వేచ్ఛను అందిస్తూ పాలించినటువంటి దాఖలు లేవు. కనుక గత పాలకులు లాగ రోటీన్ పాలన అందించకుండా, ఒక డిఫరెంట్ పాలన ప్రతి ప్రజలకి ఆర్థిక ఫలాలు అందించే విధంగా జిమ్మదారితనంతో పాలించడం కోసం మీ ముందుకు వచ్చాము. మమ్మల్ని మా సిద్ధాంతాల్ని మా నాయకుల్ని పరిశీలించి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని న్యూ ఇండియా పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటేనే ప్రజలకి ఆర్థిక ఫలాలు అంది వారి భవిష్యత్తు బంగారు బాటగా పయనిస్తుందని, ప్రతి ప్రజా బ్రతుకుతూ ఎదిగే సిస్టం ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరికీ తెలియజేయడం కోసం ప్రతి ఊరూరా, గడపగడప ఆర్థిక స్వేచ్ఛ విజయ సంకల్పయాత్ర చేస్తుంది. ఇట్టి యాత్రలో ప్రతి ప్రజా పాల్గొని న్యూ ఇండియా పార్టీ విధివిధానాలను అర్థం చేసుకొని మీరే న్యూ ఇండియా పార్టీ నాయకులుగా నాయకత్వాన్ని చేపట్టి రేపటి రోజున అధికారాన్ని కైవసం చేసుకుని మీరే పాలకులుగా ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అలాగే తెలంగాణ ఉద్యమ ఫోరం వారి డిమాండ్లను 100% నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జనగామ తిరుపతి స్టేట్ కన్వీనర్,మరియు రాష్ట్ర కార్యదర్శులు బానేష్, మరియు జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్, ఉపాధ్యక్షులు జనగామ లక్ష్మీనారాయణ, కేంద్ర కమిటీ సభ్యులు గంటా భబిత,ఎం గోపాల్, వెంకట్ రెడ్డి, మరియు తెలంగాణ ఉద్యమ పోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ భక్తుల శంకర్,రామగిరి మండల సలహాదారులు భూరువు శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి ఆరింధల ప్రకాష్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంథని విజయకుమార్, తదితరులు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.