Sunday, December 10, 2023
Homeతెలంగాణమున్సిపల్ కార్మికులకు వెయ్యి రూపాయలు ప్రకటించడం కంటి తూడ్పు చర్యే..??

మున్సిపల్ కార్మికులకు వెయ్యి రూపాయలు ప్రకటించడం కంటి తూడ్పు చర్యే..??

మున్సిపల్ కార్మికులకు వెయ్యి రూపాయలు ప్రకటించడం కంటి తూడ్పు చర్యే..?

సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్

మంథని, మే 5(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించి కార్యాలయంలో వినతి పత్రన్నీ అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ మేడే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ కార్మికులకు వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచుతామని ప్రకటించారు.మున్సిపల్ కార్మికులకు కేవలం వెయ్యి రూపాయలు పెంచడం సబబు కాదని ఇది మున్సిపల్ కార్మికుల కంటి తూడ్పు చర్యేనని అన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అక్కడి మున్సిపల్ కార్మికులకు 21000 రూపాయల వేతనాన్ని అమలు చేస్తున్నారని ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి పిఆర్సి లో కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులకు వేతనాలు 19వేల రూపాయలు నిర్ణయించారని కానీ తెలంగాణ ప్రభుత్వం 3400 వేల రూపాయలను భారీ కోత విధించి 15,600 వేలు మాత్రమే ఇస్తూ జీవో నెంబర్ 60 జారీచేసి మున్సిపల్ కార్మికులకు అన్యాయం చేశారని అన్నారు. మున్సిపల్ కార్మికుల శ్రమకు తగ్గట్టుగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వేతనాన్ని అమలు చేయాలని అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించి,కార్మికులను పర్మిట్ చేయాలని స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సింగారపు గట్టయ్య,మల్లేష్, శ్రావణ్, చందు, తదితర కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!