వివాహానికి ఆర్థిక సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్
జూలపల్లి ,మే05(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కపూర్ గ్రామంలో అట్ల మల్లయ్య కూతురు లావణ్య వివాహానికి ఆర్థిక సహాయం అందించాలని స్థానిక నాయకులు,కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ని కోరగా వెంటనే స్పందించి, యువతికి పట్టు చీర, ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.
బిసి ఉద్యమ నాయకుడు, జూలపల్లి ముద్దు బిడ్డ బొద్దుల లక్ష్మణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మల్లయ్య కుటుంబ సభ్యులు. ఈ సంధర్బంగా మల్లయ్య మాట్లాడుతు, ప్రజల కష్టాలు తెలిసిన నిజమైన నాయకుడు మా లక్ష్మణ్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కెసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్, మండల యూత్ అధ్యక్షులు జెట్టి సతీష్, జిల్లా నాయకులు అట్ల సంతోష్, వేల్పుల రామ్మూర్తి, సుంకే మధు, అబ్బేంగుల రాజారాం, గుమ్మడి స్వామి, తోవ్వ కనకయ్య, వేల్పుల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.