Monday, July 15, 2024
Homeతెలంగాణఅలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం, అలయన్స్ క్లబ్ ఆఫ్ అచివర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య...

అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం, అలయన్స్ క్లబ్ ఆఫ్ అచివర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం, అలయన్స్ క్లబ్ ఆఫ్ అచివర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ధర్మారం,మే05(కలం శ్రీ న్యూస్):పెద్దపెల్లి జిల్లా,ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక మహాలక్ష్మి హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని అలయన్స్ క్లబ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్, జాయింట్ ట్రెజరర్ ఆఫ్ సౌత్ మల్టిపుల్ కౌన్సిల్,ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్, అధినేత సిరిపురం సత్యనారాయణ  ఆధ్వర్యంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం, అచీవర్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మండల, ప్రాంత ప్రజలకు గొప్ప సువర్ణ అవకాశం.ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో నెలలో చివరి ఆదివారం ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని, అంతేకాకుండా గ్రామ గ్రామానికి వెళ్లి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా క్లబ్బుల ద్వారా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.కరీంనగర్ నుండి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు,ఎముకలు & కీళ్ల వైద్య నిపుణులు , సాధారణ వైద్యులు అందుబాటులో ఉంటారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, కోరుచున్నాము. మా అలయన్స్ క్లబ్ ప్రతి సభ్యుల కుటుంబానికి ఉచితంగా వైద్య సదుపాయము అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో 258 జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ కొమిటిరెడ్డి బుచ్చిరెడ్డి, జోన్ చైర్మన్ తాళ్ల పెళ్లి సురేందర్ గౌడ్, అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ప్రెసిడెంట్ కొత్త మోహన్, అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం అచీవర్స్ ప్రెసిడెంట్ కోరుకంటి స్వామి, సెక్రటరీలు మామిడిశెట్టి శ్రీనివాస్, ఇరుకుల్లా సంతోష్, ట్రెజరీలు ఎలిగేటి మహేందర్, జైన చంద్రమౌళి, పిఆర్వోలు బైరి చంద్రమౌళి, బీరెల్లి రవీందర్, వైస్ ప్రెసిడెంట్ తోడేటి మురళి, జాయింట్ సెక్రెటరీ అమరపల్లి నారాయణ,గౌరవ సభ్యులు వేముండ్ల సుభాష్, ఎలువక బుచ్చన్న, నడిమెట్ల సత్యనారాయణ, సాధన మల్లారెడ్డి, మహాలక్ష్మి హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్లు డా.వి.డి రత్నకుమార్, డా.కె. సృజన్ కుమార్, డా. సిహెచ్. వేణుగోపాల్, నర్సులు, ఆయాలు, వివిధ గ్రామాల నుండి వచ్చిన పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!