వడ్లు కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని, మే 4(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ లో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని జేసీ తో ఫోన్ లో మాట్లాడి వెంటనే వడ్లను కొనుగోలు చేయాలనీ కోరారు బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ ఇన్ని రోజులు తేమ శాతం లేదని సాకుతో వడ్లను కొనలేదు ఇప్పుడు తేమ శాతం ప్రభుత్వం సూచించిన విధంగా ఉన్న ఎందుకు కొనడం లేదని, మళ్లీ వర్షాలు కురిస్తే రైతుల పరిస్థితి ఏంటని ,రిబ్బన్ కటింగ్లకు పోజులు ఇయ్యడమే తప్ప వడ్లు కొనుగోలు చేసే పట్టింపు లేదా నాయకులకు? రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే కెసిఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే అకాల వర్షానికి పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం అదుకోవాలి,కొనుగోలు కేంద్రలలో మౌలిక సదుపాయాలు కల్పించి, వర్షల దృష్ట టార్పాలిన్ కవర్స్ అందించాలని,ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండ వెంటనే ధాన్యం కొనాలి, బీజేపీ పార్టీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాది తరుగుపేరిట రైతులను దోచుకుంటే ఊరుకోం,తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తేమ శాతం 20 ఉన్న సరే వడ్లను కొనాలి, ప్రభుత్వం చాల చోట్ల కొనుగోలు కేంద్రంలు కల్పించకపోవడం వల్ల రైతు లు కల్లంలలో వడ్లు పోసుకొని పడిగాపులు కాస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పసల్ భీమా పథకం మన రాష్ట్రo లో అమలు చేస్తే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు ఎంతగానో రైతులకు ఉపయోగ పడేది అన్నారు.ఈ కార్యక్రమంలో రామగిరి మండల బీజేపీ ఇంచార్జ్ మోలుమురి శ్రీనివాస్ బీజేపీ ఐటీ మరియు సోషల్ మీడియా మంథని నియోజకవర్గం జాయింట్ కన్వినర్ తొట్ల రాజు, కుంట చక్రి,జానీ భాయ్,ఉదరి కొమరయ్య,రేణుకుంట్ల విజయ్,కుమ్మరి నరేష్,అంకాల కుమారస్వామి,మబ్బు సతీష్,చింటూ, బన్నీ, కోరబోయిన మల్లిక్, బూడిద తిరుపతి తదితరులు పాల్గొన్నారు.