Monday, July 15, 2024
Homeతెలంగాణఘనంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుల జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుల జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుల జన్మదిన వేడుకలు

పెద్దపల్లి,మే04:(కలం శ్రీ న్యూస్ ): ప్రెస్ క్లబ్ సభ్యుల సమీష్టి సహకారంతో ఆదర్శవంత మైన ప్రెస్ క్లబ్ గా తీర్చి దిద్దుతామని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ప్రదాన కార్యదర్శి నారాయిణదాస్ అశోక్,కోశాధికారి బెజ్జంకి నరేష్ లు పేర్కోన్నారు.వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం ప్రెస్ క్లబ్ ఆవరణలో వారి జన్మదిన వేడుకను ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ ప్రదాన కార్యదర్శి నారాయిణదాస్ అశోక్,కోశాధికారి బెజ్జంకి నరేష్ లకు క్లబ్ సభ్యులు శాలువా కప్పి సత్కరించారు.వారిచే జన్మదిన కేక్ ను కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం ఇరువురు క్లబ్ సభ్యులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా అశోక్,నరేష్ లు మాట్లాడుతూ తమపై క్లబ్ అభ్యులు ప్రేమతో జన్మదిన వేడుక నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.అందరం సమిష్ఠిగా కలిసి మెలసి పనిచేసి పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.క్లబ్‌కి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకువస్తామన్నారు.ఒక కుటుంబ వాతావరణం కల్పించేందుకు క్లబ్ సభ్యులంతా కలిసి ప్రయత్నిద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ వేడుకలో లైసెట్టి రాజు,కేతిరెడ్డి ప్రవీణ్ రెడ్డి,గంధం రాజేష్,పులిపాక రామకృష్ణ,వీరమల్ల విద్యాసాగర్ రావు,ఆరెళ్లి మల్లేష్,కుమ్మరి ముఖేష్,కలవేన రాజేందర్, ఆకుల రమేష్,నాగిశెట్టి శ్రీనివాస్,రవి యాదవ్,సాబీర్ పాషా,జిలుకర రమేష్, యండీ.ఇబ్రహీం,పురేళ్ల శ్రవణ్,కొలిపాక కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!