Sunday, December 3, 2023
Homeతెలంగాణముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.

ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.

ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.

మంథని, మే 4(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో మంథని విద్యార్థి యువత స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా వ్యవస్థపక అధ్యక్షులు కొండేలా మారుతీ సారథ్యంలో ఏర్పాటు చేసిన మంథని నియోజకవర్గ అభివృద్ధి బాటకు భారతీయ జనతా పార్టీ వారితో ముఖాముఖి కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని స్పోర్ట్స్, రోడ్స్, లైబ్రరీ, మార్కెట్ యార్డ్, బస్టాండ్, కాలేజీ, హాస్పిటల్, చిన్ని కాళేశ్వరం, పోతారం లిఫ్ట్ ఇరిగేషన్, ఫిషరీస్ , టూరిజం ఇండస్ట్రీ, మహిళా ఉపాధి కల్పన, రైల్వే, తదితర అంశాలపై వక్తలతో క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ మంథని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరు అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలి, మంథని ప్రాంతంలో మంచి హాస్పిటల్ లేదు, చదువుకోని వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికీ ఉపాధి కల్పించాలని, ఒక మంత్రి, ఒక ప్రధాని, స్పీకర్ గా మన ప్రాంతం నుండి ఎన్నిక అయినా మంథని తల రాత మరెలేదు, డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల ఒక చిన్న వర్షం కురుస్తే మంథని పట్టణం చెరువును తలపిస్తుంది, మున్సిపాలిటీ చేసి మంథని ప్రాంతంలో ఉపాధి లేకుండా చేశారు. రోడ్ లు సరిగా లేకపోవడం, సహజ వనరులు సమృద్ధిగా ఉన్న మన ప్రాంతంనుండి బొగ్గు, నీళ్లు, ఇసుక తరలించుకుపోతు మనకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మన ప్రాంతాని కి శాశ్వతంగా నష్టం చేశారు బ్యాక్ వాటర్ వల్ల నష్టం పోతున్న మన రైతులకీ క్రాప్ హాలీడే, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లాంటివీ కల్పించాలి, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేస్తే మంథని ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. నాయకులు ఒకరిని ఒకరు తిట్టకోకుండా అభివృద్ధి పై చర్చించాలి, అమెరిక లో ఉన్నత ఉద్యోగం వదులుకోని నా మంథని అభివృద్ధి కొరకు ఈ ప్రాంతానికి వచ్చాను,డబ్బులు సంపాదించాలనే కోరిక లేదు నేను పుట్టిన ఈ మంథని గడ్డని అభివృద్ధి చేసే వరకు విశ్రమించను, మెడికల్ కాలేజ్, పీజీ కాలేజ్ లను మంథని ప్రాంతంలో నిర్మించాలి ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో భారతదేశం కూడా అమెరికాని తలదన్నే విధంగా రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతుందని చదువుకున్న యువత, రాజకీయాల్లోకి రావాలి రాజకీయాలు మార్పు చాలా అవసరం అన్నారు.ఈ కార్యక్రమంలో మంథని అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, బిఎస్ఎ నియోజకవర్గ ఇన్చార్జ్ చిలివేరి సతీష్, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బోయిని నారాయణ, ముత్తారం మండల ఇంచార్జ్ పోతారవేణి క్రాంతికుమార్, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్, బోగోజు శ్రీనివాస్, రాపర్తి సంతోష్, కోరబోయిన మల్లిక్, బూడిద తిరుపతి, ఎడ్ల సాగర్, కాసర్ల సూర్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!