విద్యుత్ ఘాతంతో మేకలు మృతి
మంథని మే 3 (కలం శ్రీ న్యూస్ ): విద్యుత్ ఘాతంతో మేక మృతి చెందిన సంఘటన మంథని మండలంలోని కన్నాల గ్రామంలో, ఎక్లాస్ పూర్ గ్రామపంచాయతి పరిధిలోని నెల్లిపల్లి కి చెందిన వేముల రాజం కు చెందిన మేక విద్యుత్ ఘాతుకానికి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కన్నాల గ్రామానికి చెందిన ఉడత చంద్రయ్య అనే రైతుకు సంబంధించిన మేక పశుగ్రాసం తింటున్న సమయంలో అకస్మికంగా విద్యుత్ షాక్ తో మరణించింది. రూ. 15,000 ల విలువ గల మేక మృతి చెందడంతో చంద్రయ్య బోరున పిలిపించాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరారు.