సాల్మన్ రాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి
మంథని, మే 3(కలం శ్రీ న్యూస్): క్రిస్టియన్ ఎమ్మెల్సీగా గోనె సాల్మన్ కు అవకాశం కల్పించాలని తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ మంథని డివిజన్ అధ్యక్షుడు పాస్టర్ వల్లూరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సిరిపురం అబ్రాహాము ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రిస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగు తున్న ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిందని, దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన గోనె సాల్మన్ రాజుకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. క్రిస్టియన్ సోదరులకు సహాకరిస్తున్న గొనె సాలమన్ రాజ్ ను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తే రాష్ట్రంలోని క్రిస్టియన్ లకు అందుబాటులో ఉండి సమస్యల పరిస్కారానికి కృషి చేస్తారని, ఇప్పటికే 33 జిల్లాల క్రైస్తవులను ఐక్యతను తెచ్చి క్రైస్తవ సమస్యలు పరిష్కార దశగా పనిచేస్తున్నారన్నారు. మంథని నియోజకవర్గ క్రిస్టియన్ సోదరులందరు మద్దతు ప్రకటిస్తూ, వచ్చే ఎన్నికలలో క్రిస్టియన్ కుటుంబాల శ్రేయస్సు కోరే వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.