Wednesday, November 29, 2023
Homeతెలంగాణగీతకార్మికుల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పెద్దపీట..

గీతకార్మికుల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పెద్దపీట..

గీతకార్మికుల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పెద్దపీట..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం హర్షణీయం..

గౌడ సంఘం నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్‌..

మంథని, మే 3(కలం శ్రీ న్యూస్ ):గీతకార్మికుల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని గౌడ సంఘం డివిజన్‌ అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్‌ అన్నారు. కల్లుగీత వృత్తిదారుల బతుకులకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గీతకార్మికుల బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తూ అమలు చేయాలని సంబంధిత శాఖ మంత్రికి ఆదేశాలివ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గీత కార్మికుల సంక్షేమం కోసం రైతుబీమా తరహాలో గీత కార్మికులకు భీమాసౌకర్యాన్ని కల్పించడం హర్షనీయమన్నారు. గీతా వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే గీత కార్మికులు గతంలోప్రమాదవశాత్తు మరణించినా,గాయపడ్డా ఎక్స్‌గ్రేషియా మంజూరీ కావడంలో ఆలస్యం అయ్యేదన్నారు. కానీ ఈనాడు సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో రైతుబీమా తరహాలో గీతాకార్మికుడికి ప్రమాదం జరిగితే వెంటనే ఎక్స్‌గ్రేషియా లభిస్తుందని ఆయన వివరించారు. అలాగే కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేలా నీరా కేఫ్‌లను ఏర్పాటు చేయడం గొప్పవిషయమన్నారు.హైదరాబాద్‌, రంగారెడ్డిలో ప్రారంభించుకోవడంతోపాటు మిగతా జిల్లాల్లో కూడా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. కల్లు గీతా వృత్తితోపాటు గీత కార్మికుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తుందని ఆయన కొనియాడారు. గీతకార్మికుల బీమా సౌకర్యాన్ని అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ లకు ఆయన గౌడ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మంథని గౌడ సంఘం అధ్యక్షుడు మాచిడి మోహన్‌గౌడ్‌, రేణుకా ఎల్లమ్మ ఆలయ చైర్మన్‌ మాచిడి సత్యనారాయణగౌడ్‌, ఆరెల్లి కొమురయ్య గౌడ్‌ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!