పుట్ట లింగమ్మ ట్రస్ట్ సేవలు మరువలేనివి…. యూత్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్..
మంథని, మే 3(కలం శ్రీ న్యూస్ ):మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ తో కలిసి పుట్ట లింగమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి మా బ్రతుకులు మార్చే గొప్ప నాయకునికి జన్మనిచ్చిన తల్లివి అని ప్రాద్ధించిన సబ్ డివిజన్ యూత్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్.ఈ సందర్భంగా నాయిని శ్రీనివాస్ మాట్లాడుతూ మంథని నియోజక వర్గంలో పుట్ట లింగమ్మ చారి టబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహించే సేవలు మరువలేనివి అన్నారు. మంథని నియోజక వర్గానికి ఒక మంచి నాయకుడైన పుట్ట మధన్న కి జన్మనిచ్చిన మాహనుబావులు పుట్ట లింగమ్మ మంథని లో ఎన్నో ఏళ్లుగా చీకటి బ్రతుకులు బ్రతుకుతున్న ప్రజలు ఈ రోజు ఆర్థికంగా,అభివృద్ధి లో ముందు ఉందంటే అది కేవలం పుట్ట లింగమ్మ కుమారు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అంతే కాకుండా కరోనా విజృంభిస్తున్న సమయం లో కూడా ఇంటి పెద్ద కొడుకు అయి ప్రతి ఇంటి కష్ట సుఖాలను పంచుకునీ పెద్ద దిక్కుగా నిల్చిన ఘనత పుట్ట మధన్న దే అన్నారు. నియోజక వర్గం దాదాపుగా పుట్ట లింగమ్మ ట్రస్ట్ సేవలు చాలా మందికి కుటుంబాలకి పెద్దదిక్కుగా అందించారని రానున్న రోజుల్లో పుట్ట లింగమ్మ కుమారుడిని మళ్లీ మంథని నియోజక ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యే గా గెలిపించుకోవాలని అన్నారు.