ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలి
మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్
సుల్తానాబాద్,మే03(కలం శ్రీ న్యూస్):అత్యవసర సమయంలో గుండెపోటుకు గురైన వారిని ఆదుకునేందుకు సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్పి అంగన్వాడి లకు వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న పలువురికి గర్రెపల్లి పి.హెచ్.సి వైద్యులు డాక్టర్. మధుకర్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ అనేక సందర్భాలలో గుండెపోటుకు గురైన వారికి ప్రథమ చికిత్స అందక చాలామంది మృత్యువాత పడుతున్నారని, దానిని నివారించేందుకు ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలన్నారు. గుండెపోటుకు గురైన వారికి శ్వాస అందించే విధానాన్ని గుండె కుత్రిమంగా కొట్టుకునే విధంగా చేయు పద్ధతులను వివరించారు. అవగాహన పెంచుకుని ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం సమీప ఆసుపత్రులకు తరలిస్తే అనేకమందిని కాపాడిన వారు అవుతారని అన్నారు. అనంతరం ప్రతిమతో కృత్రిమ శ్వాసను అందించే విధానాన్ని గుండె పని చేయు విధానాన్ని వైద్యులు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ రాజశేఖర్, డాక్టర్ మధుకర్ కుమార్, వార్డు కౌన్సిలర్ రెవెల్లి తిరుపతి,మేనేజర్ అలిమోద్దీన్,అంగన్వాడీ టీచర్లు, ఏ.ఎన్.ఎమ్ లు, ఆర్పీ (రీసోర్స్ పర్సన్ )లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.