గీత కార్మికులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం
ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు ఐదు లక్షల సహాయం
కెసిఆర్ సేవాదళం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
జూలపల్లి,మే03(కలం శ్రీ న్యూస్):తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గౌడ కులస్తులకు, గీత కార్మికులకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారని, అందులో భాగంగా ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి మరణించిన గీత కార్మికులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా కెసిఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు ,జూలపల్లి జడ్పిటిసి ,పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొద్దుల లక్ష్మణ్ ఆదేశాల మేరకు జూలపల్లి మండలంలోని స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద గీత కార్మికుల మధ్యన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి కేేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ సేవాదళం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి వెంకన్న పటేల్ ,కాంతయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూ దేశంలోనే తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ ప్రతి కుల సంఘం ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్న గొప్ప మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెసిఆర్ సేవాలాల్ మండల అధ్యక్షులు అమర గాని శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షులు జెట్టి సతీష్, కేసీఆర్ సేవాదళం జిల్లా నాయకులు బింగి రాజు, రాయనవేని శ్రీనివాస్, అమర గాని పరుశురాం ,బొంగోని కనకయ్య ,భూసారపు కుమార్, ధర్మయ్య, బొంగాని రమేష్ ,మల్లేశం ,మహేందర్, శంకర్ ,రాయలింగు, అభి, స్వామి ,పాపయ్య ,లచ్చయ్య, మల్లేశం ,తదితరులు పాల్గొన్నారు.