Friday, July 19, 2024
Homeతెలంగాణజగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

జగిత్యాల, మే02 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాన్లీ సెక్షన్ 76 యాక్టు ఈ నెల 01 నుండి 31 వరకు ఆమలులో వుంటుంది అని జిల్లా ఎస్పీ భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి అన్నారు.వివిధ కారణాలచే ర్యాలీలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!