Sunday, December 10, 2023
Homeతెలంగాణకల్లాలు ఓపెన్ చేసి కాంటలు బందు పెట్టిండ్రు..

కల్లాలు ఓపెన్ చేసి కాంటలు బందు పెట్టిండ్రు..

కల్లాలు ఓపెన్ చేసి కాంటలు బందు పెట్టిండ్రు..

మంథని మే 2(కలం శ్రీ న్యూస్):ఎలాంటి షరతులు లేకుండా రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని షరతులు విధించకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంగళవారం మంథని నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ మాదాడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంథని నియోజకవర్గం లో ఇప్పటికీ 20 నుంచి 25 రోజులు అవుతుంది ప్రతి మార్కెట్లో వడ్లు రైతులు దాన్యం తీసుకువచ్చిన కానీ ఇప్పటివరకు ఏ ఒక్క మార్కెట్లో కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అధికార పార్టీ నాయకులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గానీ ప్రజాప్రతినిధులు గానీ నూతనంగా నిర్మించినటువంటి సచివాలయ మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈరోజు మంథని నియోజకవర్గంలో అన్ని గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతులు అందరిని ఏకం చేసి నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మార్కెట్ ను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వడ్లను తూర్పాల పడితేనే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో మేండె రాజయ్య తెలుగుదేశం పార్టీ పెద్దపెల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, తెలుగు యువత నాయకులు బడుగు మహేష్,మాదరవేన ఓదెలు, మహిళా నాయకురాలు మెండ లక్ష్మి శ్రీనివాస్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!