గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడమే ప్రభుత్వ లక్ష్యం..
మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ…
మంథని మే 1(కలం శ్రీ న్యూస్ ):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని వాలీబాల్ శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో సోమవారం మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ వేసవికాలంలో బయట తిరుగుతూ చల్లగా ఉండడానికి చెరువులకు కుంటలకు వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. విద్యార్థినీ విద్యార్థులు బయట తిరగకుండా సెల్ ఫోన్ కి అంకితం కాకుండా వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
ఈ వేసవి వాలీబాల్ శిక్షణలో 16 ఏళ్లలోపు బాలబాలికలు ఫోర్త్ క్లాస్ నుండి సెకండ్ ఇయర్ వరకు అర్హులు వాలీబాల్ శిక్షణకు ఆసక్తి గల విద్యార్థులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9849503412 ఈ వాలీబాల్ శిక్షణ శిబిరం ఒక నెలపాటు జరుగుతుందని వాలీబాల్ శిక్షకులు కావేటిసమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.