పేదలపై పెనుబారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం… జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్.
మంథని మే 1(కలం శ్రీ న్యూస్ ):కార్మికులపై పెనుబారం మోపెల కేంద్రం వ్యవహరిస్తుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు.
సోమవారం ప్రపంచ మే డే దినోత్సవం పురస్కరించుకొని మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి ఆధ్వర్యంలో కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పెరిగిన ఆదాయాన్ని, ప్రజలకు,సంక్షేమ పథకాల అభివృద్ధి పనుల రూపంలో ఖర్చు చేస్తుంటే కేంద్రం మాత్రం పేదల పొట్ట కొడుతుందన్నారు. ప్రైవేటు కరుణతో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను బడుగు, బలహీన వర్గాలకు అందకుండా పోతున్నాయని మధుకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదలను కొల్లగొట్టి దాన్ని ఆదాని, అంబానీలకు పంచుతున్నారన్నారు. కార్మికులపై పెనుబారం మోపిల కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కార్మికులు రైతుల పక్షాన నిలుస్తుందని మధుకర్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, జెడ్పిటిసి తగరం సుమలత శంకర్ లాల్, సింగల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,రైతుబంధు సమితి అధ్యక్షులు ఆకుల కిరణ్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ గౌడ్, తగరం శంకర్ లాల్,నక్క శంకర్,డైరెక్టర్లు జంజర్ల. లింగయ్య,వేల్పుల గట్టయ్య,ప్రభాకర్,బాబా, ఉడత లింగన్న,ఓల్లాల లింగమూర్తి,తదితరులు పాల్గొన్నారు.