కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ గౌడ్ కు ట్యాబ్ అందుచేత.
మంథని మే 1(కలం శ్రీ న్యూస్ ):కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్,అరెళ్ళి కిరణ్ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి మాజీ ఎమ్మెల్యే అనిల్ సోమవారం గాంధీభవన్ లో ట్యాబ్ అందజేశారు.సోషల్ మీడియాలో జిల్లా కోఆర్డినేటర్స్ లు క్రియాశీలంగా పనిచేయాలని,కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన అభివృద్ధి పనులను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని రోహిత్ చౌదరి అన్నారు.ఈ కార్యక్రమం లో సోషల్ మీడియా చైర్మెన్ తో పాటు అన్ని జిల్లాల సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.