వికలాంగులకు గుండె ధైర్యం తెలంగాణ ప్రభుత్వం..
జిల్లా జడ్పీ చైర్మన్ కు జ్ఞాపిక అందజేత..
మంథని మే 1(కలం శ్రీ న్యూస్ ): శారీరక, మానసిక వికలాంగులకు గుండె ధైర్యం గా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు, గోదావరిఖని ఎండిహెచ్డబ్ల్యూఎస్ ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వ జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం నాడు మంథని లోని రాజ గృహాలో పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ను కలిసి జ్ఞాపికను అందజేసి వికలాంగుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వికలాంగులను పట్టించుకున్న పాపాన పోలేదని, వికలాంగులకు కనీస రక్షణ కూడా కల్పించలేదని, సమాజంలో వికలాంగులను చిన్న చూపు చూడడం వల్ల మానసికంగా మరింత కృంగిపోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులకు కనీస జీవన భృతి కూడా కల్పించే ఆలోచన చేయలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు ఆసరా పెన్షన్ కల్పించి జీవితాలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా తాజాగా వికలాంగుల పై దాడులు చేసిన, చిన్న చూపుతో మాట్లాడిన, అవమానించిన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ జీవోను అమలు చేయడం గర్వంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని పేర్కొన్నారు.