Tuesday, July 16, 2024
Homeతెలంగాణగౌతమి అసంఘటిత కార్మికుల సంఘం ఆవిర్బావం..

గౌతమి అసంఘటిత కార్మికుల సంఘం ఆవిర్బావం..

గౌతమి అసంఘటిత కార్మికుల సంఘం ఆవిర్బావం..

మంథని మే 1(కలం శ్రీ న్యూస్ ):మంథని విద్యార్థి యువత స్వచ్ఛంద స్ఫూర్తి సంస్థ తన 40 వ వార్షికోత్సవ నేపథ్యంలో  మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వివిధ రాజకీయ పార్టీల నేతలు కార్మీక కర్షక ఆటో మోటార్ ఇత్యాది రంగలాకు చెందిన వారు హాజరయ్యారు.మంథని వ్యాపార వాణిజ్య రంగాలలో పని చేస్తున్న వందలాది కార్మికుల తో ఈ సంఘం శుభారమౌతుందన్నారు ..ఈ సంస్థాగత వ్యవస్థాపకులు కొండేల మారుతి తెలిపారు.ఈ పక్షం రోజుల వ్యవధితో సంబందిత ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికార యంత్రాంగం తో సంక్షేమ పథకాలు లభ్యమయ్యేలా సమావేశం నిర్వహిస్తామన్నారు.

మే డే ప్రశస్త్యం దాని చరిత అలాగే నేటీకింకా కొనసాగుతున్న కార్మిక శైలి గురించి మూడు గంటల పాటు వక్తలు విశదీకరించారు. కొండపాక సత్యప్రకాశ్,బూడిద గణేష్, కొవ్వూరి రాజలింగ్‌ , రామడుగు మారుతి, మాచిడి రవితేజ గౌడ్, బూడిద తిరుపతి, గడిపెల్లి అజయ్, బెజ్జంకి దిగంబర్ ప్రసంగించారు. కామ్రెడ్స్ కొమురోజు చంద్రమోహన్, గడిపల్లి ఆజయ్‌, మేదరబోయిన కిషన్, జమీల్, కే లింగయ్య లతో పాటు పలువురిని సత్కరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!