Monday, July 15, 2024
Homeతెలంగాణతడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్

వెల్గటూర్, మే 01 (కలం శ్రీ న్యూస్):వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వలన కొనుగోలు కేంద్రాలలో నిలిచి ఉన్న ధాన్యం పూర్తిగా తడిచిందని, ప్రభుత్వం సహకారం తో తడిచిన దావ్యాన్ని కొనుగోలు చేస్తామని వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం మండలంలో గల పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఫోన్ లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో తడిచిన ధాన్యంతో రైతులు పడుతున్న అవస్థలను గురించి వారికి వివరించారు. ఈమేరకు మంత్రులిద్దరు స్పందించి వెంటనే జగిత్యాల జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలనీ తెలిపినట్లు సమాచారం. కాగా వెల్గటూర్ మండలంలోని పలు గ్రామాలలో వర్గాల వలన పంటలు నష్టపోగా వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ క్షేత్రాలకు సందర్శించి పంట నష్టం అంచనా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వెల్టటూర్ పిసియస్ చైర్మన్ గోలి రత్నాకర్, శాఖాహర్ సర్పంచ్ బాలసాని రవి, ఉప సర్పంచ్ తనుగుల మహేష్ కవిత నాయకులు తనుగుల మల్లేష్ సంతోష్, శ్రీను, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!