హమాలీ కార్మికులకు దుస్తులు పంపిణీ
సుల్తానాబాద్,మే01(కలం శ్రీ న్యూస్):కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులకు, మహిళ కార్మికులకు యూనిఫాం దుస్తులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటి చైర్ పర్సన్ బుర్ర మౌనిక శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ సంచాలకులు ఆదేశానుసారం మార్కెట్ యార్డులో పనిచేస్తున్న లైసెన్స్ హమాలీ కార్మికులు, దడువాయిలు, మహిళా కార్మికులకు యూనిఫాం పంపిణీ చేశామని అన్నారు. కార్మికుల తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న మే డే సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గరిగంటి కుమార్ బాబు, లెంకల రవీందర్ రెడ్డి, బోయిని ముత్యాలు, మార్కెట్ కార్యదర్శి సతీష్ కుమార్, సెక్యూరిటీ సిబ్బంది అబ్దుల్ సలీం, జూపాక కుమారస్వామి, అమీరిషెట్టి తిరుపతి, అర్. శ్రీనివాస్, మోబీన్, షరీఫిద్దీన్, హమాలీ కార్మికులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.