నష్టపోయిన రైతులను ఆదుకోండి
8వ వార్డు కౌన్సిలర్ చింతల సునీత రాజు.
సుల్తానాబాద్, ఎప్రిల్ 30(కలం శ్రీ న్యూస్):వడగళ్ల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఇలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 8వ వార్డుకు చెందిన కౌన్సిలర్ చింతల సునీత రాజు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం కురిసిన వడగళ్ల వర్షానికి ఆరు కాలాలు పాటు కష్టపడి పండించిన పంటను చేతికొచ్చి చేయిజారిపోయిందని, రైతులు ఏమి చేయలేని పరిస్థితిని వ్యవసాయ మార్కెట్ యార్డులో పోసిన దాన్యం పూర్తిగా తడిసి ముద్దయిందనిి, రైతే రాజు అనే తెలంగాణ ప్రభుత్వం రైతులకు నష్టం జరుగుతుందని, నష్టపోయిన రైతులకు పంట నష్టం సాయం చేస్తూ తడిసిన ముద్దయిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.