అవార్డులు ప్రభుత్వానికి… కన్నీళ్లు కార్యదర్శులకా
ప్రజాసంఘాల విమర్శ..
మంథని ఏప్రిల్ 29(కలం శ్రీ న్యూస్ ):గత రెండు రోజులుగా గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని మంథని ఎంపీడీవో కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు మద్దతుగా శనివారం ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం, పల్లె ప్రగతి లో గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు.అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన డిఎస్ఆర్ డైలీ శానిటైజేషన్ ఆప్ కూడా వారు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాల్లో పరిశుభ్రత పాటిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు చేసిన కృషి ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో గాని హరితహారం లో గాని ఇతర పథకాలలో గాని కేంద్ర ప్రభుత్వం అవార్డులు పొందుతుందని అన్నారు. ఇంత కృషి చేస్తున్నటువంటి గ్రామపంచాయతీ కార్యదర్శులకు కన్నీళ్లు మాత్రమే మిగులుతున్నాయని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల,పేరుతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కూడా నీళ్లు ,నిధులు, ఉద్యోగాల కోసం రోడ్లమీద ధర్నాలు, రాస్తరోకాలు, సమ్మెలు, చేసేటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా రావడం బాధాకరం అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిస్టంలను పాతరేస్తామని చెప్పిన కేసీఆర్ స్వరాష్ట్రంలో కూడా పాత పద్ధతులను కాంట్రాక్ట్ సిస్టన్ని ఔట్సోర్సింగ్ సిస్టం ప్రోత్సహించడం ఏమిటి అని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శుల ప్రోహబిషన్ పీరియడ్ ముగుస్తున్న సమయంలో జీవో నెంబర్ 26 ప్రకారం ఇంకొక సంవత్సరం ప్రోహాబిషన్ పీరియడ్ని వెంచుతూ దాని తర్వాత వెంటనే వారిని క్రమవిద్ధీకరిస్తానని నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన కెసిఆర్ మాట తప్పడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా జిపిఎస్ మరియు ఓపీఎస్లను వెంటనే పంచాయతీ కార్యదర్శులుగా అలాగే ఓపిఎస్ల ను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్దీకరించి వారి యొక్క ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్,తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోరెంకల సురేష్, కెవిపిస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్య, పాల్గొన్నారు.