Monday, July 15, 2024
Homeతెలంగాణపంచాయితీ కార్యదర్శిల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

పంచాయితీ కార్యదర్శిల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

పంచాయితీ కార్యదర్శిల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

మంథని ఏప్రిల్ 29(కలం శ్రీ న్యూస్ ):మంథని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు రెండు రోజులుగా పంచాయితీ కార్యదర్శిలు చేస్తున్నా సమ్మెకు ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సేగ్గం రాజేష్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేశారు.అనంతరం సేగ్గం రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానమే తెలంగాణలో ఉండదని చెప్పిన కేసీఆర్ కేవలం మాటల వరకే పరిమితం చేశారు.2019లో విధుల్లోకి చేర్చుకొని ఇప్పటివరకు కూడా పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయకపోవడం చాలా బాధాకరం.జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు ఓపియస్ లను రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయాలి.ఇప్పటివరకు పూర్తిచేసిన ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలి.రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ ను నిర్ధారించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల గ్రేట్3 గా పరిగణించాలి.ఇప్పటివరకు మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ కారుణ్య నియమకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు మంథని సత్యం, రావికంటి సతీష్, వేల్పుల రాజు, పెంటరి రాజు,మంథని రాకేష్, ఆర్ల నాగరాజు, దొగగోర్ల శ్రీనివాస్ యాదవ్, ఉట్ల అనిల్ రెడ్డి,పల్లె రవి, కన్నబోయిన ఓదెలు,ఎరుకల రమేష్ బాబు, అక్కపాక సదయ్య, జనగమ సడువలి,మంథని సమ్మయ్య,పోరండ్ల రంజిత్, కెక్కర్ల సందీప్, రితీష్, ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!