Monday, July 15, 2024
Homeతెలంగాణమండల యువజన కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ ....

మండల యువజన కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ ….

మండల యువజన కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ ….

మంథని ఏప్రిల్ 28(కలం శ్రీ న్యూస్ ):యువజనకాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, జిల్లాప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు మాట్లాడుతూ నిన్న బిఆర్ ఎస్ యూత్ నాయకులు అవి వివేకముగా మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం . బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమే.మంథని ప్రాంత అభివృద్ధి ప్రదాతలు స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు, మరియు వారి తనయుడు శ్రీధర్ బాబు. మంథని నియోజక వర్గం అభివృద్ధి జరిగిందంటే దుద్దిల్ల కుటుంబం ద్వారానే జరిగిందని తెలిపారు .మంథనిలో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు తిరగడం పైన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు.శీను బాబు వారి కుటుంబానికి ఈ ప్రాంతంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఒక్క ఫోన్ తో సమస్య పరిష్కారానికి శక్తి, సామర్థ్యాలు ఉన్న వ్యక్తి శీను బాబు.ఈ ప్రాంతంలో రోడ్డు సదుపాయాలు, స్కూల్లో, కళాశాలలు,సాగునీరు తాగునీరు అందించిన ఘనత శ్రీధర్ బాబుది.బహుజన వాదం పేరుతో ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న పుట్ట మధుకు ప్రజలు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.తన రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ నుండి తెలుగుదేశం తెలుగుదేశం నుండి ప్రజారాజ్యం ప్రజారాజ్యం నుండి వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి నుండి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన రాజకీయ వ్యభిచారి పుట్ట మధు.ఇటీవల జరిగిన ప్రతినిధుల సమావేశంలో టికెట్ కోసం కొట్లాడిన సంగతి మనందరికీ తెలిసినదే టీఆర్ఎస్ టికెట్ రాదని ఆక్రోషన్లో మా నాయకుని పైన అవాకులు చివాకుల పేలితే జాగ్రత్త అని తెలిపారు .ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు రాజు తేజ పటేల్, ఉరకొండ గణేష్,పెరుగు సతీష్, దాది రమేష్, నితీష్ లు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!