Monday, July 15, 2024
Homeతెలంగాణబీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో భారీగా బీజేపీ పార్టీ లో చేరికలు... ...

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో భారీగా బీజేపీ పార్టీ లో చేరికలు…   

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో భారీగా బీజేపీ పార్టీ లో చేరికలు…       

మంథని ఏప్రిల్ 28(కలం శ్రీ న్యూస్ ):బిఆర్ ఎస్ ,కాంగ్రెస్ నాయకులు తెల్లారి లేస్తే ప్రెస్ మీట్ పెట్టుకోని ఒకరిని ఒకరు తిట్టుకోవడం తప్ప మంథని ప్రాంతనికి మీరు చేసిన అభివృద్ధి ఏమిటి? బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బీజేపీ పార్టీ ఆఫీస్ లో బొడ్డు శివకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లో కాటారం,గారెపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మంది గ్రామస్తులు చేరారు. వీరికి సునీల్ రెడ్డి కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి, సంక్షేమ పథకలకు ఆకర్షితులై,మంథని ప్రాంతంలో మార్పు తీసుకురావాలినే లక్ష్యం తో సునీల్ రెడ్డి నాయకత్వం లో పని చేయాలనే ఆకాంక్షతో పార్టీ లో చేరుతున్నట్టు వారు వెల్లడించారు. అనంతరం సునిల్ రెడ్డి ప్రసంగిస్తూ మంథని ప్రాంతంలో బిజెపి పార్టీ రోజురోజుకి బలపడుతుంది,టిఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగుచెందారు,మంథని ప్రాంత కాంగ్రెస్,బిఆర్ఎస్ నాయకులు అభివృద్ధిలో పోటీ పడడం చేతకాక ప్రెస్ మీట్ లు పెట్టుకొని వ్యక్తిగత దూషణలు, అసభ్యపదజాలం తో తిట్టుకోవడం ఎజెండాగా మలుచుకున్నారు,అకాల వర్షంతో ప్రజలు తీవ్ర నష్టపోయారు వారిని పట్టించుకోవాల్సింది పోయి ఒకరినొకరు దూషించుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారు. మన ప్రాంతం నుండి నీళ్లు,బొగ్గు, ఇసుక తరలించుకు పోతు మనకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు,12 సంవత్సరాలుగా ఈ ప్రాంతం మార్పు కోరుకుంటూన్న ఒక్కసారి అవకాశం ఇవండీ, నాకు సంపాదించుకోవాలనే ఆలోచన లేదు,ఉన్నత ఉద్యోగం వదిలి నా మంథని ప్రాంతానికి సేవ చేయాలి అని వచ్చాను అన్నారు. ఈకార్యక్రమంలో అసెంబ్లీకో కన్వినర్ నాంపల్లి రమేష్, కాటారం మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, కాటారం మండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేంద్ర ప్రసాద్,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బోయిని నారాయణ, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లికార్జున్, బూడిద తిరుపతి, చీదురాల మధుకర్ రెడ్డి,టి రాజు,బొల్లం పల్లి లక్ష్మణ్ , ఎస్ స్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కాసర్ల సూర్య,పట్టణ ఉప అధ్యక్షులు దాసరి శ్రవణ్,యువ నాయకులు ఉప్పు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!