Monday, July 15, 2024
Homeతెలంగాణఅకాల వర్షాలతో పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

అకాల వర్షాలతో పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

అకాల వర్షాలతో పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి..

మంథని ఏప్రిల్ 27(కలం శ్రీ న్యూస్ ):పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగారం,కన్నాల గ్రామాలలో గురువారం వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.అనంతరం వారు మాట్లాడుతూ అకాల వర్షానికి పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం వెంటనే అదుకోవాలి,నష్టం పోయిన రైతులకు ఎకరానికి 50 వేల చెప్పున నష్ట పరిహారం అందించాలి. కొనుగోలు కేంద్రలలో మౌలిక సదుపాయాలు కల్పించి, వర్షలల దృష్ట టార్పాలిన్ కవర్స్ అందించాలని,ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండ వెంటనే ధాన్యం కొనాలి,బీజేపీ పార్టీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటది.తరుగుపేరిట రైతులను దోచుకుంటే ఊరుకోం,తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి తేమ శాతం 20 ఉన్న సరే వడ్లను కొనాలి, రైతుల ప్రభుత్వం అని చెప్పుకొనే కెసిఆర్ రైతులను ఆదుకొని మీ చిత్త శుద్ధి నిరూపించుకోవాలి,చాల చోట్ల కొనుగోలు కేంద్రంలు లేక రైతు లు కల్లంలలో వడ్ల పోసుకొని పడిగాపులులు కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పాసల్ భీమా పథకం మన రాష్ట్ర లో అమలు చేస్తే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు ఎంతగానో రైతులకు ఉపయోగ పడేది అలాంటి పథకం వస్తే బీజేపీ కి మంచి పేరు వస్తుందని నీచమైన ఆలోచన తో కెసిఆర్ అ పథకం ప్రవేశ పెట్టడం లేదు.మంథని ప్రాంతం ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వర్ష కాలం,మళ్ళీ యాసంగి లో ఇలా అకాల వర్షం వల్ల తీవ్రంగా నష్ట పోతున్నారు, వరి, తో పాటు మిర్చి, మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు వారిని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్,మండల ఇంచార్జ్ వీరబోయిన రాజేందర్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బోయిని నారాయణ, సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్, బూడిద తిరుపతి, చీదురాల మధుకర్ రెడ్డి, ఎల్కసదానందం,దొడ్డిపట్ల శంకర్, కుర్మా శేఖర్,ముసిపట్ల విద్య సాగర్ రెడ్డి, దాసరి శ్రీధర్, చీదురాల సురేందర్ రెడ్డి,పడాల తిరుపతి,మంథని బాపు,మంథని రాజయ్య , చిప్ప శంకర్,బూడిద వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!