Monday, July 15, 2024
Homeతెలంగాణసీఈఐఆర్ ద్వారా బాధితుడికి మొబైల్ అందజేసిన ఎస్సై నరేష్ కుమార్

సీఈఐఆర్ ద్వారా బాధితుడికి మొబైల్ అందజేసిన ఎస్సై నరేష్ కుమార్

సీఈఐఆర్ ద్వారా బాధితుడికి మొబైల్ అందజేసిన ఎస్సై నరేష్ కుమార్

ఎస్సై నరేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

వెల్గటూర్,ఏప్రిల్ 27 (కలం శ్రీ న్యూస్):సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ను రికవరి చేసి ఫోన్ ను బాధితునికి అందజేసినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. వెల్గటూర్ గ్రామానికి చెందిన ఎనగందుల చంద్రయ్య గత నెల శ్రీ నాగపల్లి లక్ష్మి నరసింహ స్వామి జాతరలో మొబైల్ పోగొట్టుకున్నారని, తన పోన్ ఐఎంఈఐ నెంబర్లను సిఈఐఆర్ పోర్టల్ తో డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. సిఈఐఆర్. జీవోవీ. ఇన్ వెబ్ సైట్ లో లాగిన్ అయి వివరాలు అప్లోడ్ చేయగా మొబైల్ ఫోన్ బ్లాక్ చేసి ట్రెస్డ్ డీటైల్స్ లోకి వెళ్లగా భాదితుని మొబైల్స్ లో సిమ్ కార్డు వేసిన వారి వివరాల ఆధారంగా మొబైల్ ను రికవరీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా మొబైల్ పోయినా దొంగిలించినా తక్షణమే వెబ్ సైట్ లోకి వెళ్లి ఐఎంఈఐ నెంబర్ లను ఎంటర్ చేయాలనీ తద్వారా మొబైల్ ఫోన్ ను త్వరగా రికవరీ చేయవచ్చని ఎస్సై నరేష్ కుమార్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!