Sunday, December 10, 2023
Homeతెలంగాణనోరు అదుపులో పెట్టుకోకపోతే మేం నోరు తెరుస్తం....

నోరు అదుపులో పెట్టుకోకపోతే మేం నోరు తెరుస్తం….

నోరు అదుపులో పెట్టుకోకపోతే మేం నోరు తెరుస్తం….

బీఆర్‌ఎస్‌ పార్టీ మండల యూత్‌ అధ్యక్షుడు కొండ రవీందర్‌….

మంథని ఏప్రిల్ 27(కలం శ్రీ న్యూస్ ):మంథని నియోజకవర్గ అభివృధ్దిపై మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మదూకర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్‌ నాయకులు అసభ్యంగా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల యూత్‌ అధ్యక్షుడు కొండ రవీందర్‌ అన్నారు.మంథని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు సెగ్గెం రాజేష్‌ ఒక గౌరవప్రదమైన మండల అధ్యక్ష స్థానంలో ఉండి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీ చైర్మన్‌ను అసభ్య పదజాలంతో దూషించడం ఆయన నైజానికి నిదర్శనమన్నారు. కార్యకర్త స్థాయి నుంచి ఒక బీసీ బిడ్డగా ప్రజల మన్ననలు పొందుతూ ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మదూకర్‌ ఎదిగితే ఓర్వలేని కాంగ్రెస్‌ నాయకులు నాటి నుంచి నేటి వరకు విమర్శలు చేస్తూనే ఉన్నారన్నారు. గత 40ఏండ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్థానిక కాంగ్రెస్‌ పాలకుల పాలనతో ఏం అభివృధ్ది జరిగిందని ప్రశ్నిస్తే దూషించడమేనా అని ఆయన ప్రశ్నించారు.వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే కాంగ్రెస్‌ నాయకులు వారసత్వ రాజకీయం గురించి తెలుసుకోవాలన్నారు. నాడు శ్రీపాదరావు, తరువాత శ్రీధర్‌బాబు, ఈనాడు శ్రీనుబాబు రాజకీయాల్లో తిరుగడాన్ని వారసత్వం అంటారే కానీ బార్యభర్తలు ఇద్దరు ప్రజాప్రతినిదులు ఎన్నికైతే దాన్ని తప్పు పట్టడం కాంగ్రెస్‌ నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు. మంథనిలో జరిగిన అభివృధ్ది గురించి మాట్లాడకుండా అవాక్కులు చెవాక్కులు పేలితే ఎలా అన్నారు. మంథనికి ఆమడ దూరంలో ఉన్న సూరయ్యపల్లికి వెళ్లే రహదారిలో శ్రీపాదరావు, శ్రీధర్‌బాబు అదికారంలో ఉండి ఎందుకు బ్రిడ్జి నిర్మాణం చేయలేదని ప్రశ్నించారు. ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డా పర్వాలేదు కానీ తాము మాత్రం అధికారంలో ఉండాలన్నదేనా మీ ఆకాంక్ష అన్నారు. మా నాయకుడు పుట్ట మధూకర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేశారని, ఒక్క సూరయ్యపల్లి బ్రిడ్జే కాదని పంకెన పలిమెల, పెద్దంపేట, శాత్రాజుపల్లిలాంటి మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చే విధంగా రహదారులు, వంతెనలు నిర్మించారని ఆయన గుర్తు చేశారు. 40ఏండ్లు ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన మీరు ఎందుకు ప్రజల కష్టాలు ఆలోచన చేయలేదని ప్రశ్నిస్తే చిన్నచూపుగా మాట్లాడుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 40ఏండ్లతో మీరు చేసిన అభివృధ్ది, నాలుగున్నర ఏండ్లతో మా నాయకుడు చేసిన అభివృధ్దిపై చర్చకు రావాలని ఆయన సవాల్‌ చేశారు. ఏ విషయమైన మీ నాయకుడు చెప్పాలే కానీ కిందిస్థాయి నాయకులతో విమర్శలు చేయించడం సరికాదని, మా నాయకుడు బహిరంగగానే మీ నాయకుడిని ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానం చెప్పాలన్నారు. నాలుగు గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను చూపిస్తామని సవాల్‌ చేసిన కాంగ్రెస్‌ నాయకులు అవినీతి లేకుండా రూపాయి లంచం తీసుకోకుండా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను చూపించాలని ఆయన సవాల్‌ చేశారు.ఎక్కడా పూర్తి స్థాయిలో ఇందిరమ్మ పథకంలో పేదలు లబ్ది పొందలేదని, లంచాలు, కమీషన్‌ల పేరుతోనే ఇందిరమ్మపథకం జరిగిందని, అవినీతిలేకుండా ఇండ్ల నిర్మాణం జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమేనన్నారు. ఒక గౌరవప్రదమైన పదవుల్లో ఉంటూ ఉన్నత పదవుల్లో ఉన్న నాయకుడిని విమర్శించడం గొప్పనుకునే కాంగ్రెస్‌ నాయకులు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తాము నోరు తెరిస్తామని ఆయన స్పష్టం చేశారు.బీఆర్‌ఎస్‌ జెండా మోసే ప్రతి కార్యకర్తకు సంస్కారం ఉందని, అందుకే మీ నాయకుడిపై గౌరవంగా మాట్లాడుతున్నామని, సంస్కారం లేని వారిలా విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!