Tuesday, July 16, 2024
Homeతెలంగాణకన్నుల పండుగగా ముగిసిన కంటి వెలుగు

కన్నుల పండుగగా ముగిసిన కంటి వెలుగు

కన్నుల పండుగగా ముగిసిన కంటి వెలుగు

— 23,498 మందికి పరీక్షలు

మంథని ఏప్రిల్ 27(కలం శ్రీ న్యూస్ ):గత 100 రోజులుగా కన్నుల పండుగగా నిర్వహించబడుతున్న కంటి వెలుగు కార్యక్రమం గురువారంతో విజయవంతంగా ముగిసింది. ఈ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మంథని మున్సిపల్ పరిధిలోని 13 వార్డుల్లో కలిపి 23 వేల 498 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 18 సంవత్సరాలు నిండినవారు, 16,347 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీటీలో ఐస్క్రీనుడు పరీక్షలు చేయించుకున్న వారు 10,423 మంది కాగా, రీడింగ్ గ్లాసెస్ పొందిన వారు 1,599 మంది ఉన్నారు. మంథని మున్సిపల్ పరిధిలోని 13 వార్డులో ప్రతి వార్డులో ఐదు రోజులు ఈ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. పెంజేరుపట్టలో ఐదు రోజుల పాటు నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమానికి రిటైర్డ్ ఇంజనీర్ దహగం లింగన్న అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. గురువారం పెంజేరు కట్ట వీధిలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో డాక్టర్ శంకరా దేవి, డాక్టర్ శంకరమ్మ, ఆర్థోపెటిక్ ఆఫీసర్ బుద్ధార్థి సతీష్ కుమార్, ఏఎన్ఎంలు రాధా, స్వప్న, స్రవంతి, మల్లీశ్వరి, భాగ్య, స్వప్నాలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!