డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాడుతం.
ప్రజాసంఘాల డిమాండ్
మంథని,ఎప్రిల్27(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్ స్థలాన్ని ప్రజాసంఘాల నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొక్కల వాగు మీద డంపింగ్ యార్డ్ ను నిర్వహించడం సరైన విధానం కాదు అని అన్నారు. ఈ డంపింగ్ యార్డ్ లో నీ చెత్త ప్లాస్టిక్ వ్యర్ధాలను తగలబెట్టడం వల్ల వాటి నుండి వచ్చే పొగ వలన మంథని మున్సిపల్ ప్రజలకు సూరయ్య పల్లి గ్రామ ప్రజలకు, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలకు, గర్భిణీలకు అలాగే పక్కనే జాతీయ రహదారిపై వెళ్లేటువంటి ప్రయాణికులకు కళ్ళల్లోకి పొగ సోకడం వలన ప్రమాదాలు జరిగే అటువంటి అవకాశాలు ఉన్నాయి .అలాగే ఈ పొగ వలన చిన్న పిల్లలకు, ప్రజలకు డాక్టర్లకు క్యాన్సర్ రోగాలు, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని విమర్శించారు. ఇంత వాయు కాలుష్యం జరుగుతున్నప్పటికీ వాయు కాలుష్య నియంత్ర మండలి ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ డంపింగ్ యార్డ్ నుండి వచ్చే పొగ వలన వాహన దారులు దారి కనబడక ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డ్ ను వెంటనే సుదూర ప్రాంతాలకు తరలించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనియెడల ప్రజలను కూడగట్టుకొని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంథని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొర్రెoకల సురేష్ పాల్గొన్నారు.