Sunday, December 10, 2023
Homeతెలంగాణబహుజనవాదమంటూ బహుజనులపైనే.. బహు ధనవంతుడి దాడులు.. 

బహుజనవాదమంటూ బహుజనులపైనే.. బహు ధనవంతుడి దాడులు.. 

బహుజనవాదమంటూ బహుజనులపైనే.. బహు ధనవంతుడి దాడులు.. 

మంథని ఏప్రిల్ 26(కలం శ్రీ న్యూస్ ):మంథని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు సేగ్గం రాజేష్, యూత్ కాంగ్రెస్ మంథని మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, బీసీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు గోటికారీ కిషన్ జీ, ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం మాట్లాడుతూ బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పేరుతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ని విమర్శించడం సిగ్గుచేటు ఒక గుర్తింపు లేని వాట్సాప్ న్యూస్ పేపర్ నీ పట్టుకొని కర్ణాటక రాష్ట్రంలో శ్రీధర్ బాబు నేతృత్వంలో 100 కోట్లు చేతులు మారాయి అని తప్పుడు రాతలు రాపిస్తూ పబ్బం గడిపే నీకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరమ్మ ఇండ్లని నిర్మించలేదని 200 ఇల్లు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పిన నీవు కేవలం మంథని మండలం సూరయ్య పల్లె, కాకరపల్లి, ఎగ్లాస్పూర్, ఖానాపూర్ గ్రామాలలోనే చూపిస్తాం నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా. బహుజనవాదం అంటూ బహుజనుల పైన దాడులు చేసుకుంటూ నీ రాజకీయ పదవి వ్యామోహం కోసం బహుజనుల పైనే దాడులు దళితులపై హత్యలు చేస్తూ బహుజనవాదం అని రాజకీయపదం గడుపుతున్నావు నిన్న బహుజనుడైన చల్ల నారాయణరెడ్డి పై నువ్వు చేసిన దాడిని నియోజకవర్గంలోని ప్రజలందరూ గమనించారు. నీకు రెండుసార్లు ప్రాణబిక్ష పెట్టిన దుద్దిళ్ళ కుటుంబాన్ని కసాయి కుటుంబం అనడం సిగ్గుచేటు కసాయి కుటుంబం అంటే నీది గట్టు వామన రావు దంపతులను చంపి జైల్లో ఉంది నీ అల్లుడు బహుజనులపై దాడులు, హత్యలు చేసేది నీవు నీది కసాయి కుటుంబం. అంటే ఆనాడు ని రాజకీయ ఉనికి కోసం శ్రీపాద రావు విగ్రహాన్ని మంథనిలో ఏర్పాటు చేసింది నువ్వు కాదా ఈరోజు శ్రీపాద రావు ని అసభ్యకరంగా విమర్శించడం నీ అవివేకానికి నిదర్శనం.మంథని ప్రభుత్వ ఆసుపత్రి మీ ఇంట్లో నుండి కట్టినట్టు దానికి పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశావు.కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం శ్రీధర్ బాబు కి మా పైన లేనిపోని నిందలు వేసి కేవలం ఒక్కడివే దగ్గర ఉండి ఆనాడు శ్రీధర్ బాబు పేరు చెప్పుకుంటూ ఈనాడు శ్రీధర్ బాబు ని విమర్శించుకుంటూ ఉన్నావు. నీకు వారి పేరును తీయ్యనిదే రోజే గడవదు.మంథని నియోజకవర్గం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు దుద్దిళ్ళ శ్రీపాదరావు, శ్రీధర్ బాబు చేశారు. ఏదో ఒక బ్రిడ్జి కట్టి రోడ్డు వేసి అభివృద్ధి అంతా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ ఏ చేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదమని నిత్యం శ్రీధర్ బాబు పేరును తీస్తూ జపం చేయడం మంచిది కాదని అభివృద్ధి పరంగా విమర్శించాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శించడం సరైన పద్ధతి కాదని వారికి శ్రీధర్ బాబు పోబియో పట్టినట్టు ఉంది అని మంచి డాక్టర్ కు చూపెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!