Friday, July 19, 2024
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత కేసీఆర్‌దే

తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత కేసీఆర్‌దే

తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత కేసీఆర్‌దే

పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌నేత

మంథని ఏప్రిల్ 25(కలం శ్రీ న్యూస్ ):క్యాడర్‌ లేని కాంగ్రెస్‌ను కనుమరుగు చేయడమే లక్ష్యంగా గులాబీ సైనికులు పనిచేయాలని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బొర్లకుంట వెంకటేష్‌ నేత పిలుపునిచ్చారు.మంగళవారం మంథని పట్టణంలోని ఎస్ఎల్బీ గార్డెన్‌లో మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొని ముందు పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం అమరవీరులు, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. అమరవీరులకు నివాళి అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత,మంథని నియోజకవర్గ భిఅర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధూకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు హర్షిని రాకేష్,మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ.అనంతరం ఎంపీ మాట్లాడుతూ నోట్ల కట్టలతో ఓట్లు దండుకునే కాంగ్రెస్‌ను, మతం ముసుగులో చిచ్చు పెట్టే బీజేపీని తరిమికొట్టాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గులాబీ సైనికులను, నాయకులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి బలోపేతం చేయాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేస్తూ ఏకగ్రీవ తీర్మాణాలతో ముందుకు సాగాలన్నారు. 2018లో నియోజకవర్గ ప్రజలు పెద్ద తప్పు చేశారని, కాంగ్రెస్‌ మోసపూరిత మాటలను నమ్మి మంచి మనస్సున్న ప్రజాసేవకుడైన పుట్ట మధన్నను ఓడగొట్టుకున్నారని, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా మధన్నను 36వేల బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నా అంటే నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడు పుట్ట మధు అని, నిత్యం ప్రజల కోసం ఆలోచన చేసి వారి సంక్షేమానికి నిరంతం శ్రమించే సేవకుడని కొనియాడారు. అనేక ఏండ్లు ఈ ప్రాంతంలో పరిపాలన చేసిన పాలకులు చేసిన అభివృధ్ది, సంక్షేమం ఏదీ లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాంటి మార్పు వచ్చిందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులు తెలంగాణపై వివక్ష చూపారని, అనేక కష్టాలు, కన్నీళ్లను చవిచూశామన్నారు.కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణాను ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్చిదిద్దారని ఆయన గుర్తు చేశారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృధ్ది పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చారని ఆయన కొనియాడారు. మంథని నియోజకవర్గంలో పుట్ట మధూకర్‌పై, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ పీఠాన్ని సీఎం కేసీఆర్‌ అధిరోహిస్తారనే భయం బీజేపీకి పట్టుకుందని, ఈ క్రమంలో ప్రజాస్వామ్యబద్దంగా గెలిచే సత్తాలేక ఈడీ దాడుల పేరుతో మానసికంగా దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణాపై ఇప్పటికి వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. రైతు కష్టం తెలిసిన రైతుబిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. పంట పొలాలకు వెళ్లి ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రైతు బీమా పేరుతో రూ.5లక్షలు అందించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. గడిచిన ఎనిమిది ఏండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నిసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయో వాటిలో ఏవైనా గత ప్రభుత్వాలు అమలు చేశాయా అని ఆలోచన చేయాలన్నారు. గడపగడపకు అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫలాలపై చర్చించాల్సిన అవసరం ఉందని, అవసమైతే కాంగ్రెస్‌ కార్యకర్తల ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వనించాలని ఆయన సూచించారు. నిత్యం ప్రజలకోసం ఆలోచన చేసే పుట్ట మధును ఆదరించాలని, ఏసీ గదుల్లో ఉంటూ పోలీస్‌ బలగాల మధ్య తిరిగుతూ అధికారం కోసం ఆరాటపడే నాయకుడు కావాలా లేక నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సేవకుడిలా ఉండే నాయకుడు కావాలో గులాబీశ్రేణులు ఆలోచన చేయాలన్నారు. దేశానికి గులాబీ కండువా, సీఎం కేసీఆర్‌ శ్రీరామ రక్షఅని రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సన్నద్దం కావాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

మళ్లా నోట్లకట్టలు దించేందుకు సిద్దమైండ్లు… పెద్ద పల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్ 

ఎన్నికలు వస్తున్నాయని మంథని ఎమ్మెల్యే ఇప్పటి నుంచే నోట్ల కట్టలు దించేందుకు సిద్దం చేసుకుంటున్నాడని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మదూకర్‌ అన్నారు. మంథనిలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సమావేశానికి ఆయన సభాధ్యత వహించి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన స్థానిక ఎమ్మెల్యే అక్కడ అభ్యర్ధుల టికెట్లు అమ్ముకుని వంద కోట్లు జమ చేశాడని సోషల్‌ మీడియాతో వెల్లడైందన్నారు. నోట్ల కట్టలతో పోరాటం చేయలేమని ఒకసారి ఓటమికి గురయ్యామని మరోమారు అలాంటిది జరుగకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వంద కోట్లతో వచ్చే నాయకుడిని ఎదిరించాలంటే ఆలోచన, ధైర్యం పోరాటస్పూర్తి ఉండాలన్నారు.అలాంటప్పుడే ఆనాయకుడిని ఎదిరించగలమన్నారు. 40ఏండ్లు ఈప్రాంతాన్ని పరిపాలన చేసిన దుద్దిళ్ల కుటుంబాన్ని అర్థం చేసుకోనన్ని రోజులు కష్టాలు అనుభవిస్తూనే ఉంటామన్నారు. చెంచడు నీళ్లు పోయని కుటుంబానికి ఇంకా ఓట్లు వేసి మెజార్టీ ఇస్తున్నారని, అలాంటి వారిని నమ్మి ఓట్లు ఎలా వేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. 40ఏండ్లు అధికారంలో ఉండి మంథనికి కూతవేటు దూరంలో ఉన్న సూరయ్యపల్లికి బిడ్రి కట్టలేదని ఆయన విమర్శించారు. ఒక్క సూరయ్యపల్లే కాదు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు వర్షాలు, వరదలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఇందరమ్మ పథకం ద్వారా పేదోడికి ఇండ్లు మంజూరీ చేస్తే ఆ బిల్లులతో బంగ్లాలు కట్టుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు పైపులు రోడ్లపై వేసి దత్తత్రేయ ఆలయం కట్టారని ఆయన అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో కాటారం ప్రజలు తనకు మెజార్టీ ఇవ్వకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామని, తమ సేవలు కొనసాగించామని ఆయన గుర్తు చేశారు. ఆనాడు దామెరకుంటలోని పేదలకు డబుల్‌ బెడ్‌ ఇండ్లు కట్టించాలని ఆలోచన చేసి ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించామని, అటుతర్వాత ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన శ్రీధర్‌బాబు కనీసం ఆ ఇండ్లను పూర్తి చేయాలని ఆలోచన చేయలేదన్నారు. భూపాలపల్లి జెడ్పీ చైర్‌ పర్సన్‌గా దళిత బిడ్డ, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా బీసీబిడ్డగా తాము ఉన్నామని ఇప్పటికి ఒక్కసారి కూడా జెడ్పీ సమావేశానికి హజరుకాని చరిత్ర ప్రస్తుత ఎమ్మెల్యేదన్నారు. ఈనాడు తన తండ్రి ఆశయాల కోసమే రాజకీయాల్లో వచ్చానని, తండ్రి ఆశయాలు నెరవేర్చుతానని పదేపదే చెప్పే ఎమ్మెల్యే తన తండ్రి ఆశయాలేంటో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ ప్రాంతంలోని పేద ప్రజలు ఇంకా పూరి గుడిసెల్లో ఉండాలన్నదే తండ్రి ఆశయమా అని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే అంబేద్కర్‌ ఆలోచన విధానమే కాంగ్రస్‌ పార్టీ ఏజెండా అని చెప్పుతున్న ఎమ్మెల్యే అంబేద్కర్‌ ఆలోచన విధానాలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. దళిత బిడ్డను అవమానపర్చే విధంగా జెడ్పీ సమావేశాలకు హజరు కాకపోవడమేనా అంబేద్కర్‌ ఆలోచనా విధానం అని ఆయన అన్నారు. రాజ్యాంగం రచించిన బీఆర్‌ అంబేద్కర్‌ ఆనాడే పది ఏండ్లు మాత్రమే రిజర్వేషన్‌లు ఉండాలని, ఆ తర్వాత అందరూ సమానంగా ఉండాలని చెప్పారని, కానీ ఇప్పటి వరకు రిజర్వేషన్‌లు ఎవరు పొందారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. 40ఏండ్లు పరిపాలన చేసిన దుద్దిళ్ల కుటుంబం 40కిలో మీటర్ల రింగ్‌రోడ్‌ పూర్తి చేయలేదని, తాను ఎమ్మెల్యేగా అయిన నాలుగున్నర ఏండ్లలో 65కిలోమీటర్లు పూర్తి చేశానని ఆయన వివరించారు. నాటి నుంచి నేటి వరకు మనతో ఓట్లు వేయించుకున్నారే కానీ మన బాధలు ఏనాడు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో నాయకత్వంలేని పార్టీ కాంగ్రెస్‌ అని, పిడికెడు మందిలేని పార్టీ బీజేపీ అని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో, దేశంలో పరిపాలించిన కాంగ్రెస్‌ బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడంలేదో ప్రశ్నించాలన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కాన్పు నుంచి మొదలు కాటికి పోయే వరకు అనేక పథకాలను ప్రవేశపట్టారని అయన అన్నారు. గొప్పగా అమలు చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడంతోనే బీజేపీ కాంగ్రెస్‌లు రాజ్యమేలుతున్నాయని, మనం చెప్పకపోవడం మూలంగానే అబద్దాలు అల్లుకు పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు కర్ణాటక రాష్ట్ర ఇంచార్జీగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే అక్కడి అభ్యర్ధుల నుంచి కోట్లాది రూపాయలు దండుకుని ఇక్కడ ఎన్నికల్లో ఖర్చు పెట్టే ఆలోచనలో ఉన్నాడని, అభ్యర్ధుల టికెట్టు అమ్ముకునే దుర్మార్డుడు మంథని ఎమ్మెల్యే అని ఆయన దుయ్యబట్టారు. తల్లిదండ్రులను చూడని తనను తల్లిదండ్రుల్లా ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వాదం అందించారని, రాబోయే రోజుల్లో ఇంటింటికి వస్తానని, బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ది సంక్షేమం గురించి వివరించడంతో పాటు కాంగ్రెస్‌, బీజేపీ వ్యవహరశైలి,వారి కపటప్రేమను చెప్తానని ఆయన స్పష్టం చేశారు. నోట్ల కట్టలతో ఓట్లు దండుకుంటామని పగటి కలలు కంటున్న కాంగ్రెస్‌ నాయకులకు తగిన గుణపాఠం చెప్పేలా ప్రజలు చైతన్యం కావాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!