Sunday, December 10, 2023
Homeతెలంగాణక్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ. 25,700 ఆర్థిక సహాయం'

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ. 25,700 ఆర్థిక సహాయం’

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ. 25,700 ఆర్థిక సహాయం’

కాల్వశ్రీరాంపూర్,ఎప్రిల్25(కలం శ్రీ న్యూస్):

కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆవునూరి పవన్ కుమార్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన పవన్ కుమార్ కుటుంబ దీన స్థితిని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, తన మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో రూ. 25,700 లను కలెక్ట్ చేశారు. మంగళవారం ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈర్ల సమ్మయ్య క్యాన్సర్ వ్యాధి బాధితుడు పవన్ కుమార్ తండ్రి ఆవునూరి రమేష్ కు రూ.25,700 లను అందజేశారు. శ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వై.రమేష్ చేతుల మీదుగా కలెక్ట్ చేసిన మొత్తం డబ్బులను బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ హెచ్.ఎం వై. రమేష్ మాట్లాడుతూ… ఈర్ల సమ్మయ్య పాఠశాల హెడ్మాస్టర్ గా పాఠశాల అభివృద్ధికి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేయడమే కాకుండా, అనేకమైన సామాజిక సేవ, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలు ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కోగలుగుతారని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదించాలని ఆయన కోరారు. అనంతరం ఎస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ… ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మమని, ఆ దిశలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. పవన్ కుమార్ వైద్య ఖర్చులకోసం రూ.2000 ఇచ్చిన వారు ఒకరు, రూ. 1000 ఇచ్చిన వారు నలుగురు, రూ.900 ఇచ్చిన వారు ఒకరు, రూ. 500 ఇచ్చిన వారు 37 మంది, రూ. 300 ఇచ్చిన వారు ఒకరు ఉన్నారని, వారందరికీ ఈర్ల సమ్మయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. బాలుడి వైద్యం కోసం ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి త్వరలోనే ‘మేఘన సాహితీ కళావేదిక’ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ చిలువేరు లావణ్య స్వామి, వైస్ ఛైర్మన్ తూండ్ల రాజు ఎస్ఎంసీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, తూండ్ల అరుణ కిరణ్, విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ యువతీ, యువకులు, పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!