బిఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాన్ని విజయవంతం చేయండి
మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని ఏప్రిల్ 24(కలం శ్రీ న్యూస్ ):మంథని నియోజకవర్గస్థాయి భారతీయ రాష్ట్ర సమితి ప్రతినిధుల సమావేశాన్ని విజయవంతం చేయాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. సోమవారం రాజాగృహలో మంథని మున్సిపల్ కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి మంగళవారం ఎస్ ఎల్ బి గార్డెన్ లో జరిగే భారతీయ రాష్ట్ర సమితి ప్రతినిధుల సమావేశానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్లు బాధ్యతగా వివిధ వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.