Monday, July 15, 2024
Homeతెలంగాణబస్తీబాటలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

బస్తీబాటలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

బస్తీబాటలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని,ఎప్రిల్23(కలం శ్రీ న్యూస్):దేశానికి బావిభారత పౌరులుగా ఎదిగే యువత దురలవాట్లకు బానిసైతే భవిష్యత్‌ అంధకారమే అవుతుందని జిల్లా పరిషత్‌ చైర్మన పుట్ట మధూకర్‌ అన్నారు.

 

బస్తీబాట కార్యక్రమంలో బాగంగా మంథని మున్సిపల్‌ పరిధిలోని పవర్‌హౌజ్‌ కాలనీలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఆయన కాలనీవాసులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.

 

ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు బానిసలు అయి తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని వివరించారు. గుడుంబాతో పాటు గంజాయిలాంటి మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారని, పవర్‌హౌజ్‌ కాలనీలోని యువకులు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారని ఆయన గుర్తు చేశారు. సమాజ హితం కోసం యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మంచి సమాజ స్థాపన కోసం తాము బస్తీబాట చేపట్టి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సాధారణంగా ఏ రాజకీయనాయకుడైనా అభివృధ్ది, సంక్షేమం గురించి మాత్రమే ఆలోచన చేస్తాడని, కానీ తాము సమాజహితం కోసం ఆలోచన చేస్తున్నామని, అభివృధ్ది, సమస్యలు నిరంతర ప్రక్రియలా ఉంటాయన్నారు. కానీ ఈనాడు మన పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటుపడితే ఆ కుటుంబమే కాదు సమాజానికి కూడా తీరని నష్టం జరుగుతుందని, ఈ క్రమంలోనే తాము ప్రతి కాలనీలో సమావేశాలు నిర్వహించి అక్కడి యువతలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. రాజకీయ నాయకుడిలా కాకుండా మీలో ఒకడిలా, పిల్లలను మంచి మార్గంలో నడిపించాలనే తపనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని, ఆదిలోనే అవగాహన కల్పిస్తే ఫలితం కన్పిస్తుందన్నారు. ఈనాడు మనం నిర్లక్ష్యం చేస్తే పిల్లల భవిష్యత్‌ను మనమే నాశనం చేసిన వారం అవుతామని ఆయన అన్నారు. ఒక కాలనీలో అనేక కులాలు, మతాల వాళ్లు కలిసి ఉంటారని, యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆదర్శ కమ్యూనిటీ కాలనీలా పేరు తెచ్చుకోవాలన్నారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేసే బాధ్యత తమదేనని, అభివృద్ది విషయంలో కూడా రాజీపడేది ఉండదని, కానీ యువత మంచి మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. గంజాయిలాంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని, అలాంటి యువకులు సమాజానికి ప్రమాదమని పలు ఉదాహరణలు చెప్పారు. కాలనీవాసులు అప్రమత్తంగా ఉంటూ తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలన్నారు. అలాగే కాలనీలో సీసీ కెమెరా ఏర్పాటుకు తమవంతు సహకారం అందిస్తామని ఆయన హమీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!