నాటు సారాయి తయారుచేసిన అమ్మిన, సరఫరా చేసిన కఠినమైన చర్యలు తప్పవు: ఎక్సైజ్ సీఐ సిహెచ్ సామ్యుల్ ఆనందరావు.
సుల్తానాబాద్,ఏప్రిల్ 22 (కలం శ్రీ న్యూస్) : నాటు సారాయి తయారుచేసిన అమ్మిన, సరఫరా చేసిన కఠినమైన చర్యలతో పాటు అవసరమైతే పిడియాక్ట్ నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ సిహెచ్ సామ్యూల్ ఆనందరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ ఆర్. మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం బైండోవర్ ఉల్లంఘించిన కేసులో కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన సంపంగి మహేష్ ను కాల్వశ్రీరాంపూర్ తహసీల్దారు ముందు హాజరు పరచగా జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.గత సంవత్సరం పట్టుబడిన నాటు సారా తయారు చేస్తూ తహసీల్దారు ఎదుట బైండోవర్ చేయగా, మరలా అదే నేరము చేస్తూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడగా శుక్రవారం అరెస్టు చేసి కరీంనగర్ జైలు తరలించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై శిరీష రెడ్డి, కానిస్టేబుల్స్ మనోహర్,సంపత్ పాల్గొన్నారు.