Monday, July 15, 2024
Homeతెలంగాణమైనార్టీల అభ్యున్నతికి భారాస సర్కార్ తొడ్పాటు : మహ్మద్ రియాజ్

మైనార్టీల అభ్యున్నతికి భారాస సర్కార్ తొడ్పాటు : మహ్మద్ రియాజ్

మైనార్టీల అభ్యున్నతికి భారాస సర్కార్ తొడ్పాటు : మహ్మద్ రియాజ్

జగిత్యాల ఎప్రిల్ 21(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు, ఎండపల్లి మండలాల్లోని శాఖపూర్, పాతగుడూరు గ్రామాలలో రంజాన్ పండుగ పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముస్లిం-మైనార్టీలకు అందించే తోపా, దుస్తులు శుక్రవారం పంపిణీ చేసిన వెల్గటూరు కో-అప్షన్ సభ్యుడు మహ్మద్ రియాజ్.

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ కో-ఆప్షన్ మహ్మద్ రియాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ముఖ్య అతిథులుగా హాజరైన యం.పి.పి కునమల్ల లక్ష్మీ-లింగయ్య, వెల్గటూరు ఏ.యం.సి చైర్మన్ పత్తిపాక వెంకటేష్ లు గిఫ్ట్ ప్యాక్ లను ముస్లిం ప్రజలకు అందించారు.

 

ఈ సందర్బంగా కో-అప్షన్ సభ్యుడు మహ్మద్ రియాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం-మైనార్టీ ప్రజల అభివృద్ధి-సంక్షేమంనకు అనేక కార్యక్రమాలతో అర్థిక ఎదుగుదలకు కృషి చేస్తూ భరోసా కల్పిస్తుందని, గతంలో ఎన్ని ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ముస్లిం-మైనార్టీలను పట్టించుకో లేదని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో పని చేసే భారాస పార్టీ సర్కారుకు అందరు అండగా నిలవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాకాపూరు సర్పంచ్ బాలసాని రవి, పాతగూడూరు సర్పంచ్ కొంగల జగదీశ్వర్ రెడ్డి, కిషన్ రావుపేట యం.పి.టి.సి సభ్యురాలు సప్ప జ్యోతి-రాజు, పాతగూడూరు ఎంపీటీసీ సభ్యురాలు లక్కాకుల రాణీ-శ్రీనివాస్ వెల్గటూరు, ఎండపల్లి తహశీల్దార్లు వుయ్యాల రమేష్, మెంతి ఉదయ్ కుమార్, భారాస మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ సలీం మత పెద్దలు అనీఫ్, రహీం, అబ్దుల్లా, షరీఫ్, హఫీజ్, ఖజామియా, ఫక్రిరోద్దిన్, అంకూస్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!