Tuesday, July 16, 2024
Homeతెలంగాణజర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయపాల్ పిలుపు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయపాల్ పిలుపు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయపాల్ పిలుపు

జగిత్యాల ఎప్రిల్ 21 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లాలో పలు మీడియాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్ తో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం ఉదయం పదకొండు గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రం లోని తహశీల్ చౌరస్తాలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టి డబ్ల్యూజేఎఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్. జయపాల్ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు శుక్రవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫెడరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు నిరాశే ఎదురైందన్నారు.

జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎనిమిది ఏళ్ళు అవుతున్న ఇంతవరకు ఇవ్వలేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమంను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని జయపాల్ అన్నారు.ఎనిమిది ఏళ్ల కాలంలో ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామంటూ కాలం వెళ్లదిస్తుందే తప్ప జర్నలిస్ట్ లను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సభ్యులు ద్యావర సంజీవరాజు, కార్యదర్శి వెంకటరమణ, కౌన్సిల్ సభ్యులు జీవన్ రెడ్డి, అలిశెట్టి మదన్ మోహన్, ఎన్నం కిషన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరునగరి శ్రీనివాస్, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు గుర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ జగిత్యాల పట్టణం లోని తహసిల్ చౌరస్తా వద్ద శనివారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

ముఖ్యంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి జర్నలిస్టు శ్రేయోభిలాషులు, వివిధ పార్టీల నాయకులు హాజరై జర్నలిస్టు ఆందోళనకు సంఘీభావం ప్రకటించాలని జిల్లా ఫెడరేషన్ నాయకులు కోరారు.

ఈ సమావేశంలో ఆముద లింగ రెడ్డి, మేన్నెని శ్రీనివాస రావు, మోహన్ రావు, గణేష్ లవంగా, కాంత రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!