Sunday, December 10, 2023
Homeతెలంగాణవిద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి

అక్షర వార్షికోత్సవ కార్యక్రమంలో మంథని సీఐ

మంథని ఏప్రిల్ 21(కలం శ్రీ న్యూస్ ):విద్యార్థిని విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని మంథని సీఐ సతీష్ పిలుపునిచ్చారు. స్థానిక అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల 29వ వార్షికోత్సవ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై గురువారం రాత్రి ప్రసంగించారు. విద్యార్థులు తమ జీవిత కాలంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిందని, ఇందులో భాగంగా సెల్ ఫోన్ ద్వారా కేవలం మంచి మాత్రమే నేర్చుకోవాలి అన్నారు. అనంతరం మంథని డివిజన్ పరిపాలనాధికారి తూము రవీందర్ మాట్లాడుతూ మంథనిలో మొట్టమొదటి అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. అనంతరం మహావాది విజయకుమార్, మేడ గోని రాజమౌళి గౌడ్ మాట్లాడుతూ కేరళ రాష్ట్ర నుండి వచ్చి మంథనిలో ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాటలు వేశారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అక్షర స్కూల్ కరస్పాండెంట్ అశోకన్, ప్రిన్సిపాల్ బిందు తో పాటు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి .

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!