మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని సమస్యలను పరిష్కరించాలి
ప్రజాసంఘాల డిమాండ్
మంథని,ఎప్రిల్ 21(కలం శ్రీ న్యూస్):మంథని కేంద్రంలోని మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రజాసంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొర్రెoకల సురేష్ పరిశీలించారు.
మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సరియైన నీటి సౌకర్యం లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. డాక్టర్ ఒక్కరు మాత్రమే ఉండడం వలన పేషెంట్లకు అందుబాటులో ఉండడం లేదు అని అన్నారు. ఆస్పత్రిలో మరో గైనకాలజిస్ట్ ను డిఎంఓ డాక్టర్ వెంటనే నియమించాలని అని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆసుపత్రి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్వహించి పేషెంట్ల యొక్క రక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న స్వీపర్, అటెండర్లు, పేషెంట్ కేర్ టేకర్, స్కావెంజర్స్, వార్డ్ బాయ్స్ సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని అన్నారు. పెండింగ్ లో ఉన్న సిబ్బంది యొక్క జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో ప్రకారం జీతాలను చెల్లించాలని అన్నారు. గర్భిణీలకు అందించే ఆహారంలో నాణ్యత లేకుండా ఉంటుందని ఆహారం విషయంలో నాణ్యతను పాటించాలని అన్నారు. ఈ
సమస్యల పైన ఆసుపత్రి సూపర్డెంట్ వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పక్కనే ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ నుండి వచ్చే కాలిన పొగవలన గర్భిణీలు మరియు పసిపిల్లలకు ఆసుపత్రి సిబ్బందికి అనారోగ్య సమస్యలు అలాగే క్యాన్సర్ చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని అన్నారు వేసవికాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలర్లు ఏర్పాటు చేయాలని అన్నారు , సమస్యలన్నింటి పైన తక్షణమే చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆసుపత్రి సమస్యలు పరిష్కారం చేసే వరకు పోరాటం,ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు..