ఘనంగా మంత్రి కొప్పుల జన్మదిన వేడుకలు
మంథని ఏప్రిల్ 20(కలం శ్రీ న్యూస్ ):రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను మంథని నియోజవకర్గంలో బీఆర్‌ఎస్ పార్టీశ్రేణులు ఘనంగా నిర్వహించారు.
మంథని నియోజవకర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు మంథని,ముత్తారం, కమాన్‌పూర్, మహముత్తారం, రామగిరి, మల్హర్, మహదేవ్‌పూర్, కాటారం మండలాల్లో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు మంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్బంగా ఆయా మండల కేంద్రాల్లో ప్రజలు,పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.జిల్లా మంత్రిగా కొప్పుల ఈశ్వర్ మంథని నియోజకవర్గ అభివృధ్దిలో జెడ్పీ చైర్మన్ పుట్టమధూకర్‌కు వెన్నంటి ఉండి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేశారని కొనియాడారు. ప్రజా సేవ, ప్రజా సంక్షేమం, అభివృధ్దికి ఆరాటపడే జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌కు అడుగడుగునా ప్రోత్సాహం అందిస్తూ ఈ ప్రాంత అభివృధ్ది, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎనవేని కృషి చేశారని కొనియాడారు. మంథని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మంత్రి మరిన్ని పదవులు పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయా మండలాల పార్టీశ్రేణులు, అబిమానులు ఆకాంక్షించారు.