Sunday, December 10, 2023
Homeతెలంగాణవరి ధాన్యం కొనుగోలులో దేశంలోనే ప్రథమం...

వరి ధాన్యం కొనుగోలులో దేశంలోనే ప్రథమం…

వరి ధాన్యం కొనుగోలులో దేశంలోనే ప్రథమం…

అధిక మద్దతు ధర తెలంగాణలోనే…

సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని ఏప్రిల్ 20(కలం శ్రీ న్యూస్ ):రైతుల నుంచి ధాన్యం కొనుగోలు దేశంలోనే తెలంగాణలో త్వరగా ప్రారంభించామని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధి మంథని మండలం నాగెపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రారంభించగా, భట్టుపల్లి కేంద్రాన్ని సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, వెంకటాపూర్ కేంద్రాన్ని డైరెక్టర్ పెద్దిరాజు ప్రభాకర్, ఆరెంద కేంద్రాన్ని సర్పంచ్ మాసిరెడ్డి శ్రీకళ-జనార్ధన్ రెడ్డిలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులకు అన్ని రకాల సహాయాలు అందిస్తున్న కర్షక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ముందుచూపుతో ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం నేడు దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు. ఎక్కడా లేని విధంగా సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ఏ గ్రేడ్ కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు రైతులకు కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, ఇందులో భాగంగా తాగునీటి వసతి, చలువ పందిర్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సంఘ డైరెక్టర్లు రావికంటి సతీష్ కుమార్, సిరిమూర్తి ఓదెలు,గడ్డం పోచం, సిఈఓ మామిడాల అశోక్ కుమార్, సర్పంచులు గూడ సరోజన,దబ్బెట సరోజన-తిరుపతి, బందెల లక్ష్మణ్, నాయకులు తోటపల్లి రవి, తాటి బాపు, మాసిరెడ్డి రాజేంద్రప్రసాద్, గూడెపు మహేందర్, ఊట్ల అనిల్, పంచిక రమేష్, గూడ సుధాకర్,బొమ్మ రాజిరెడ్డి, బక్కిరెడ్డి, బందెల నారాయణ, బోగరాజు వెంకటేశ్వర్ రాజు, రైతులు, రైతు నాయకులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!