Monday, July 15, 2024
Homeతెలంగాణకొప్పుల ఈశ్వర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బొద్దుల లక్ష్మణ్

కొప్పుల ఈశ్వర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బొద్దుల లక్ష్మణ్

కొప్పుల ఈశ్వర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బొద్దుల లక్ష్మణ్

హైదరాబాద్,ఎప్రిల్20(కలం శ్రీ న్యూస్):హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ కి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ సేవాదళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ . ఈ సందర్భంగా బొద్దుల లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలానికి చెందిన కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా సేవలందించడం పెద్దపెల్లి జిల్లా, జూలపల్లి మండల ప్రజల కు గర్వకారణం అని అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ చే ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జన్మదినం రోజున ఆవిష్కరించబడిన

ప్రపంచంలోనే ఎత్తైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడంలో మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న బృహత్తరమైన దళిత బంధు పథకానికి సంబంధించిన శాఖ మంత్రిగా కూడా కొప్పుల ఈశ్వర్ ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా వారు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నారని ఆ భగవంతుని ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నానని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!